Wednesday, 22 January 2020

మహేష్ నెక్ట్స్‌.. స్పైడర్‌ తరహా పాత్రలో సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ ప్రస్తుతం సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో అదే ఆనందంలో ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళ్లాడు మహేష్‌. అయితే ఇప్పటికే తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ హీరోగా మహర్షి లాంటి బ్లాక్‌ బస్టర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి, ఈ సారి సూపర్‌ స్టార్‌ను ఓ యాక్షన్‌ హీరోలా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అందుకు తగ్గట్టుగా స్పై తరహా కథాంశంతో మహేష్ బాబును జేమ్స్‌ బాండ్‌లా చూపించేందుకు రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయ్యిందని త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందన్న టాక్‌ వినిపిస్తోంది. Also Read: అంతేకాదు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన భరత్‌ అనే నేను సినిమాలో కియారా హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు మరోసారి ఈ భామ సూపర్‌ స్టార్ సినిమాలో నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వురు. మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దిల్ రాజు సమర్పణలో అనిల్‌ సుంకర, మహేష్‌ బాబులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో దాదాపు 13 ఏళ్ల తరువాత విజయశాంతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GbKnRC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...