Sunday, 8 December 2019

ఎన్టీఆర్ ఛారిటబుల్ సర్వీసెస్.. తారక్ ఫ్యాన్స్ శభాష్

స్టార్ హీరోల అభిమానులు వారి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ఎప్పటి నుంచో నడుస్తోంది. మెగా అభిమానులు, నందమూరి అభిమానులు, ఘట్టమనేని అభిమానులు ఇలా ఇండస్ట్రీలో మంచి పలుకుబడి ఉన్న ఫ్యామిలీలకు చెందిన అభిమాన సంఘాలు వారి పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. హీరోల పుట్టినరోజుల సందర్భంగా హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంచడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేయడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఏకంగా ఆయన పేరిట ఒక ఛారిటబుల్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నడిపించనున్నారు. ‘ఎన్టీఆర్ ఛారిటబుల్ సర్వీసెస్’ పేరిట ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ట్విట్టర్ ద్వారా సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ ప్రజలకు పరిచయం చేశారు. Also Read: ‘‘ఒక చిరునవ్వుతో చేసే చిన్న సాయం మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. ఎన్టీఆర్ ఛారిటబుల్ సర్వీసెస్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. తారక్ అన్న ఫ్యాన్స్ గొప్ప ప్రయత్నం ఇది. ఆ దేవుడి దీవెనలు వాళ్లకు ఉండాలి’’ అని తమన్ ట్వీట్ చేశారు. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమాతో బిజీగా ఉన్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి తారక్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జనవరి నుంచి పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్నారు. అలాగే, ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్ కనిపించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qyBv4r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...