Sunday, 8 December 2019

‘ఎంత మంచివాడవురా!’ ఫస్ట్ సాంగ్.. ఇది ఎస్పీ బాలు మధుర గీతం

నందమూరి కళ్యాణ్‌ రామ్‌, మెహరీన్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్య మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఆల్బమ్‌లోని తొలి పాటను ఆదివారం విడుదల చేశారు. వాస్తవానికి ఈ పాటను శుక్రవారమే విడుదల చేయాల్సి ఉంది. అయితే, ఆరోజు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరగడం వల్ల ప్రజలంతా అదే మూడ్‌లో ఉన్నారు. దీంతో విడుదలను వాయిదా వేసి ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. Also Read: ఈ పాటను గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ పాట వింటుంటే చాలా రోజుల తరవాత ఒక మంచి తెలుగు పాట విన్నామనే ఫీలింగ్ కలుగుతోంది. గోపీ సుందర్ అంత బాగా స్వరపరిచారు. ఇక రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. ఎస్పీబీ వాయిస్ వింటుంటే ఏదో యువ గాయకుడి గాత్రంలా అనిపిస్తోంది. గతంలో ‘శతమానం భవతి’ సినిమాలోనూ బాలు ఒక పాట పాడారు. ‘నిలవదే’ అంటూ సాగే ఆ పాట అప్పట్లో సూపర్ హిట్. ఇప్పుడు ఈ పాట కూడా అంతే హిట్ అవ్వడం ఖాయం. కాగా, ‘ఎంత మంచివాడవురా!’ ఒక ఫ్యామిలీ డ్రామా. భారీ తారాగణంతో తెరకెక్కుతోంది. వి.కె.న‌రేష్, సుహాసిని, శరత్‌బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌ కిశోర్‌, ప్రవీణ్‌, ప్రభాస్ శ్రీను త‌దిత‌రులు నటించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మిస్తున్నారు. See Photo Story:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/344CNBD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...