Sunday, 8 December 2019

ఏం చూడాలో.. ఏం చూడకూడదో.. వాళ్లు నిర్ణయించటం ఏంటి?

ఇటీవల కాలంలో సెన్సార్‌ కారణంగా చాలా సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బోల్డ్‌, కాంట్రవర్షియల్‌ కంటెంట్‌తో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలంటే చాలా పరీక్షలకు తలవంచాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో సినిమాలోని కీలకమైన కంటెంట్‌ను పక్కన పెట్టి మరీ సినిమా రిలీజ్‌ చేయాల్సి వస్తోంది. ఈ విధానంపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల రామ్‌ గోపాల్‌ వర్మ లాంటి వారు సెన్సార్‌ బోర్డ్‌పై ప్రత్యక్షంగానే విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సెన్సార్‌ విధానాన్ని ప్రశ్నించాడు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఓ బాలీవుడ్‌ నటుడు చేరాడు. హిందీతో పాటు పలు రీజినల్‌ సినిమాల్లో నటిస్తున్న ఉత్తరాది నటుడు సెన్సార్‌ విధానం సరిగ్గా లేదన్నాడు. Also Read: ప్రస్తుతం ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ సీజన్‌ 2 ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వివేక్‌ ఒబెరాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన `సెన్సార్‌ అనేది అవుట్‌ డేటెడ్‌ కాన్సెప్ట్‌ అన్నాడు. ప్రేక్షకులకు తాము కోరుకునేది చూసే స్వేచ్ఛ ఉండాలన్నాడు. `ఓటీటీ ప్లాట్‌ఫాంలకు సెన్సార్‌ అనేది ఉండకూడదని నా అభిప్రాయం. సెన్సార్‌ అనేది అవుట్‌డేటెడ్‌ పద్ధతి. మన ఉంటున్న సమాజంలో అనేది నెగెటివ్‌ విషయం. సెన్సార్‌కు బదులుగా కొత్త రేటింగ్‌ విధానం ప్రవేశపెట్టాలి. ఈ సినిమాలో అభ్యంతరకర భాష వినియోగించారు, సన్నివేశాలు ఉన్నాయి.. లాంటి విషయాలు తెలిసేలా రేటింగ్‌ విధానం ప్రవేశపెట్టాలి. 18 ఏళ్ల వయసులోనే దేశ నాయకున్ని ఎన్నుకునే హక్కు కల్పిస్తున్న మనం, ఏ సినిమా చూడాలి అనే నిర్ణయాన్ని వాళ్లకు ఇవ్వకపోవటం కరెక్ట్‌ కాదు` అన్నాడు వివేక్‌. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DYRUSC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...