Sunday, 8 December 2019

‘సూర్యుడివో చంద్రుడివో’ సాంగ్.. మహేష్ మెలోడికి ఒక ప్రత్యేకత ఉంది!

ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘ఎఫ్2’ లాంటి కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేయబోతున్నారు. ‘సూర్యుడివో చంద్రుడివో’ అంటూ సాగే మంచి మెలోడి సాంగ్‌ని సోమవారం సాయంత్రం 5:04 గంటలకి విడుదల చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకుని ఈ మెలోడీని కంపోజ్ చేసినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకి ఒక ప్రత్యేకత ఉంది.ఈ పాటను ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి ప్రాక్ ఆలపించారు. దక్షిణాది సినిమాలో ఆయన పాడిన తొలిపాట ఇది. ఒక మంచి పాట ద్వారా ప్రాక్ దక్షిణాది సినీ అభిమానులకు పరిచయం కాబోతున్నారు. కాగా, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో మహేష్ బాబు క్యారక్టరైజేషన్, కామెడీ టైమింగ్ హైలైట్స్‌గా ఉండనున్నాయట. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మహేష్ బాబు సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3532ZhB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...