Sunday, 8 December 2019

ప్రభాస్ సినిమా షూటింగ్ వాయిదా.. విదేశాలకు రెబల్ స్టార్!

‘సాహో’ లాంటి భారీ చిత్రం తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఒక లవ్‌ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ నవంబర్ 18 నుంచి ప్రారంభంకావాల్సి ఉంది. దీనికోసం ఇటలీలో ఒకప్పటి పరిస్థితులు, వాతావరణాన్ని తలపించేలా హైదరాబాద్‌లో భారీ సెట్ కూడా వేస్తున్నారు. కారణాలేమిటో తెలియదు కాని ఈ షెడ్యూల్ అనుకున్న సమయానికి ప్రారంభంకాలేదు. అయితే, ఈ షెడ్యూల్‌ను జనవరి మూడో వారానికి వాయిదా వేశారని ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. ప్రభాస్ ఇప్పటికే లాంగ్ హాలీడేను ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లిపోయారట. ఎక్కడికి వెళ్లారన్నది మాత్రం సీక్రెట్. ఆయన తిరిగి మళ్లీ జనవరిలో హైదరాబాద్‌కు వస్తారట. జనవరి 3వ వారంలో మాత్రమే షూటింగ్ ప్రారంభమవుతుందని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది కచ్చితంగా చెబుతున్నారు. Also Read: కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38eQ125
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...