Wednesday, 25 December 2019

చందానగర్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్.. వెళ్లిపోయిన మహేష్

సూపర్‌స్టార్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి సినిమాను డైరెక్ట్ చేశారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల సినిమా షూటింగ్ పూర్తైంది. అయితే షూటింగ్ ప్రమోషన్స్‌లో భాగంగా మహేష్ హైదరాబాద్‌లోని చందానగర్‌‌కు వెళ్లారు. అక్కడ ఫొటోషూట్ దిగుతున్న సమయంలో జనం ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి గాయాలయ్యాయి. అభిమానులు అధిక సంఖ్యలో రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఫొటో షూట్‌కు చిత్రయూనిట్ అనుమతి తీసుకోలేదని, పోలీసులకు ముందస్తు సమాచారం అందించలేదని తెలుస్తోంది. దాంతో పరిస్థితి తీవ్రం కాకముందే మహేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఈ విషయంపై చిత్రబృందం నంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, హరితేజ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు మిలిటరీ మేజర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. పోస్టర్‌లో మహేష్‌ను రష్మిక కౌగిలించుకున్నట్లుగా డిజైన్ చేశారు. ఇకపోతే ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నారు. ఇప్పటి వరకు మహేష్ నటించిన ఏ సినిమాకూ చిరంజీవి గెస్ట్‌గా వెళ్లలేదు. తొలిసారి వీరిద్దరూ స్టేజ్‌పై సందడి చేయబోతున్నారు. దాంతో ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ ఆపుకోలేకపోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34QHAY5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...