Wednesday, 25 December 2019

చందానగర్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్.. వెళ్లిపోయిన మహేష్

సూపర్‌స్టార్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని చందానగర్‌లో జరుగుతోంది. మహేష్ వస్తున్నారని తెలుసుకుని జనం ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి గాయాలయ్యాయి. అభిమానులు అధిక సంఖ్యలో రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే షూటింగ్‌కు చిత్రయూనిట్ అనుమతి తీసుకోలేదని, పోలీసులకు ముందస్తు సమాచారం అందించలేదని తెలుస్తోంది. దాంతో పరిస్థితి తీవ్రం కాకముందే మహేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఈ విషయంపై చిత్రబృందం నంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, హరితేజ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు మిలిటరీ మేజర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. పోస్టర్‌లో మహేష్‌ను రష్మిక కౌగిలించుకున్నట్లుగా డిజైన్ చేశారు. ఇకపోతే ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నారు. ఇప్పటి వరకు మహేష్ నటించిన ఏ సినిమాకూ చిరంజీవి గెస్ట్‌గా వెళ్లలేదు. తొలిసారి వీరిద్దరూ స్టేజ్‌పై సందడి చేయబోతున్నారు. దాంతో ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ ఆపుకోలేకపోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3734zjS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...