Sunday, 8 December 2019

అసభ్యకరమైన ఫొటో పెట్టిన నటి.. క్లాస్ పీకిన నెటిజన్స్

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు పెట్టే ఫొటోలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నటీమణులు, మోడల్స్ పెట్టే ఫొటోలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఏవైనా ఫొటోలు పెడితే నెటిజన్లు చూసి బాగుంది అనుకోవాలి కానీ, చూడలేక నోరెళ్లబెట్టే విధంగా ఉండకూడదు. పైగా అలాంటి అసభ్యకరమైన ఫొటోలపై ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులు ఓ కన్నేసి ఉంచుతున్నారు. అశ్లీలత ఎక్కువగా ఉండే ఫొటోలను ఇన్‌స్టాగ్రామే స్వయంగా డిలీట్ చేసేస్తోంది. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఫొటో చర్చనీయాంశంగా మారింది. తన కూతురు ఎదురుగానే వక్షోజాలు కనపడేలా ఫొటో దిగి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇలాంటి ఫొటోలు చూసి ఎంజాయ్ చేసే నెటిజన్లు చాలా మందే ఉంటారు. కానీ ఈ ఫొటోలు యువతపై చెడు ప్రభావం చూపేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ క్రిస్సీకి క్లాస్ పీకాడు. ‘నీ కూతురు ఉంది. కప్పుకో’ అన్నాడు. ఇందుకు క్రిస్సీ సమాధానం ఇస్తూ.. ‘కొన్ని నెలల పాటు నా చనుబాలు తాగింది. తనేం అనుకోదు’ అని పొగరుగా సమాధానం ఇచ్చింది. అయితే ఇటీవల ప్రముఖ అమెరికన్ సింగర్ జేసన్ డెరూలో పోస్ట్ చేసిన ఫొటో అభ్యంతకరంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. మరి అలాంటప్పుడు క్రిస్సీ పోస్ట్ చేసిన ఫొటోను ఇంకా ఎందుకు తొలగించలేదో తెలియాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36i1Bb6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...