Saturday, 14 December 2019

ఫైనల్‌గా హిట్ దర్శకుడికి హీరో దొరికాడు!

గీత గోవిందం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్‌. ఇంతటి ఘన విజయం తరువాత కూడా పరశురామ్‌ మరో సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. గీత గోవిందం సినిమా తరువాత స్టార్ హీరోతో సినిమా చేయాలని భావించాడు పరశురామ్‌. మహేష్ బాబుతో సినిమా కోసం చాలా ప్రయత్నాలే చేశాడు. ఒక దశలో మహేష్‌తో ప్రాజెక్ట్ ఓకె అయినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ ఫైనల్‌ కాలేదు. తరువాత మరికొంత మంది స్టార్ హీరోలను ప్రయత్నించి పరశురామ్‌ ఫైనల్‌గా ఓ హీరోను ఒప్పించాడు. యువ సామ్రాట్‌ నాగచైతన్య 20వ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించనున్నాడు. Also Read: శనివారం ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాను 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు చైతూ. ఇటీవల ఈ సినిమాలో చైతూ లుక్‌ను రివీల్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల మజిలీ ఘన విజయం అందుకున్న నాగచైతన్య తాజాగా వెంకీ మామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు కూడా పాజిటివ్‌ టాక్‌ రావటంతో తదుపరి చిత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న శేఖర్‌ కమ్ముల సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38zBEpk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...