Friday, 13 December 2019

రాకీ బాయ్‌ మళ్లీ వస్తున్నాడు.. `కేజీఎఫ్ చాప్టర్‌ 2` ఫస్ట్‌ లుక్‌ డేట్‌ ఫిక్స్‌

బాహుబలి తరువాత దాదాపు అదే స్థాయిలో సంచలనం సృష్టించిన సినిమా కేజీఎఫ్‌. కన్నడ యంగ్ హీరో యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అదే స్థాయిలో సంచలనాలు నమోదు చేసింది. అప్పటి కన్నడ సినిమా అంటే ఉన్న చిన్న చూపును చేరిపేస్తూ ఇతర భాషల్లోని టాప్‌ స్టార్లు కూడా కన్నడ సినిమాల వైపు చూసేలా చేసింది. కేజీఎఫ్ ఘన విజయం సాధించటంతో ఈ సినిమా సీక్వెల్‌ మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. Also Read: అందుకు తగ్గట్టుగా టాప్‌ స్టార్స్‌తో ఆసక్తికరంగా కేజీఎఫ్‌ చాప్టర్‌ 2ను తెరకెక్కిస్తున్నారు. యష్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ మెయిన్‌ విలన్‌ అధిరా పాత్రలో నటిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు తొలి భాగాన్ని మించి ఎన్నో హంగులు ఈ సినిమాకు జోడిస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. ఇటీవల సంజయ్‌ దత్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో సంజూ లుక్‌ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. త్వరలో ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. Also Read: ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 21 సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నటుడు సంజయ్ దత్‌ తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా వెల్లడించాడు. డిసెంబర్‌ 21 సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ అవుతుందని వెల్లడించాడు సంజు బాబా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్‌ కిరగండూర్‌ నిర్మిస్తున్నాడు. యష్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రవినా టండన్‌, అనంత్‌ నాగ్‌, మాళవిక అవినాష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2020 జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34iRUYC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...