Saturday, 14 December 2019

Catherine Tresa: బొగ్గుగని శీనుతో సుమిత మేడమ్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నెం.3 ఇదిగో

‘’ దూకుడు మామూలుగా లేదు. క్రాంతిమాధ‌వ్ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీలో విజయ్ సరసన ఐశ్వర్యా రాజేష్‌, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసా, రాశీఖ‌న్నాలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ జనవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. నలుగురు లవర్స్ లుక్స్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్. ఐశ్వర్య రాజేశ్ లుక్‌ని డిసెంబర్ 12న 6:03 గంటలకు విడుదల చేయగా.. ఇజాబెల్లా లుక్‌ని 13న 6:03 గంటలకు విడుదల చేశారు. ఇక మూడో హీరోయిన్ కేథరిన్ లుక్‌ను ఈరోజు డిసెంబర్ 14న 6:03 గంటలకు విడుదల చేశారు. రేపు అనగా డిసెంబర్ 15న 6:03 గంటలకు విజయ్ దేవరకొండ నాలుగో లవర్ రాశి ఖన్నా లుక్‌లు విడుదల చేయనున్నారు. ఇలా నాలుగురోజుల పాటు నలుగురి లవర్స్ లుక్స్‌ని వారి క్యారెక్టర్స్‌ని రివీల్ చేయనున్నాడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఐశ్వర్యా రాజేష్‌.. సువర్ణ పాత్రలో డీ గ్లామరస్‌గా కనిపించి సర్ ప్రైజ్ చేయగా.. ఇజాగా ఇజాబెల్లా కనిపించింది. ఇక ఈరోజు విడుదలైన మూడో లవర్ లుక్‌లో కేథరిన్ సుమిత మేడమ్‌గా సర్ ప్రైజ్ చేసింది. బొగ్గుగనిలో పనిచేసే యూనియన్ లీడర్ శీను ప్రేమలో సుమిత మేడమ్ ఎలా పడిందన్న కోణంలో వీరి మధ్య లవ్ ట్రాక్ ఉండనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2POw89G
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...