Wednesday, 25 December 2019

వైజాగ్ కుర్రాళ్లకి రాంగోపాల్ వర్మ బంపరాఫర్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా వెరైటీగా ఉంటుంది. ఒక సినిమాకు ఎలా ప్రచారం కల్పించొచ్చో, ప్రజల్లోకి ఆ సినిమాను ఏ విధంగా తీసుకెళ్లొచ్చో బహుశా వర్మకు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. తన శిష్యులనే దర్శకులుగా పెట్టి తానే స్వయంగా సమర్పిస్తూ ఈ మధ్య వరసపెట్టి సినిమాలు చేస్తు్న్నారు వర్మ. తక్కువ బడ్జెట్‌తో సినిమా తీసి సోషల్ మీడియా ద్వారానే ఆ సినిమాకు మంచి ప్రచారం కల్పించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ‘బ్యూటిఫుల్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు వర్మ. ఇప్పుడు ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు. అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈలోగా సినిమాకు వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పించాలని వర్మ చూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోయిన్ నైనా గంగూలీతో స్టెప్పులేసి అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. ఇప్పుడు వర్మ వైజాగ్ ప్రేక్షకులను టార్గెట్ చేశారు. Also Read: విశాఖపట్నంలో ఈనెల 27న ‘బ్యూటిఫుల్’ మ్యూజికల్ ఈవెంట్‌ను వర్మ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి మద్దిలపాలెంలో ఉన్న సీఎంఆర్ మాల్‌లో ఈ ఈవెంట్ ఉంటుంది. వర్మతో పాటు హీరోయిన్ నైనా గంగూలీ, హీరో సూరి, దర్శకుడు అగస్త్య మంజు ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. అయితే, ఈ ఈవెంట్‌లో పాల్గొనాల్సందిగా వైజాగ్ ప్రజలను ట్విట్టర్ ద్వారా కోరారు వర్మ. అంతేకాదు, వైజాగ్ కుర్రాళ్లకు వర్మ ఒక బంపరాఫర్ ఇచ్చారు. ఈ ఈవెంట్‌లో ఒక కాంటెస్ట్ నిర్వహిస్తామని, దీనిలో గెలిచిన వారు హీరోయిన్ నైనా గంగూలీతో డ్యాన్స్ చేయొచ్చని వర్మ చెప్పారు. సాయంత్రం 6 గంటలకు జగదాంబలో నిర్వహించే కార్యక్రమంలో హీరోయిన్‌తో డ్యాన్స్ చేయిస్తామన్నారు. గెట్ రెడీ వైజాగ్ బోయ్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39e7N5Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...