Wednesday, 25 December 2019

‘కోబ్రా’గా వస్తోన్న విక్రమ్.. భయపెడుతోన్న మోషన్ పోస్టర్

తమిళ నటుడు విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 90ల్లో పలు తెలుగు సినిమాల్లో నటించిన విక్రమ్ ఆ తరవాత తమిళంలో మాస్ హీరోగా ఎదిగారు. తమిళంలో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకోవడమే కాకుండా చియాన్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. అయితే, తెలుగులో ‘శివపుత్రుడు’ సినిమాతో అందరినీ ఆకర్షించారు. ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపరిచితుడు’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్ అయ్యారు. ఇక అక్కడి నుంచి ఆయన తమిళ సినిమాలన్నీ తెలుగులోకి అనువాదమయ్యాయి. ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్ హీరోగా చాలా సినిమాలు తెలుగులోకి అనువాదమైనా ఏ ఒక్కటీ ఆకట్టుకోలేదు. కిందటేడాది వచ్చిన ‘స్కెచ్’, ‘సామీ 2’ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఈసారి మాత్రం ఒక వెరైటీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు విక్రమ్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ తన 58వ సినిమాను చేస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు ‘కోబ్రా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం టైటిల్‌ను ప్రకటించారు. అలాగే, టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. నిజం చెప్పాలంటే నాగుపాములు పాకుతున్నట్టు ఉన్న ఈ మోషన్ పోస్టర్ భయపెడుతోంది. మరి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఈ సినిమాను 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MpxPJJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...