Wednesday, 11 December 2019

బాలీవుడ్‌ సినిమాకు నో చెప్పిన సమంత.. కారణం ఏంటంటే?

సౌత్‌ హీరోయిన్లు బాలీవుడ్ సినిమా అవకాశం వస్తే ఎగిరి గంతేసి మరి ఓకే చెప్తారు. అలాంటిది స్టార్ హీరోయిన్‌ మాత్రం బాలీవుడ్‌ సినిమాకు నో చెప్పింది. ప్రస్తుతం 96 సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న మూవీలో శర్వానంద్‌కు జోడిగా నటిస్తున్న ఈ బ్యూటీకి బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు క్రేజీ ఆఫర్‌ ఇచ్చారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో గ్లామర్‌ రోల్స్‌లో నటించిన సమంత పెళ్లి తరువాత నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. అదే బాటలో సమంత లీడ్‌ రోల్‌లో నటించిన సినిమా యూ టర్న్‌. కన్నడ సూపర్‌ హిట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ పరవాలేదనిపించింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. Also Read: అయితే తెలుగులో అద్భుతంగా నటించి మెప్పించిన సమంతను హిందీ వర్షన్‌లోనూ నటింప చేసేందుకు సంప్రదించారు. అయితే సమంత మాత్రం ఈ ప్రపోజల్‌ను తిరస్కరించింది. ఒకసారి చేసిన పాత్రను మరోసారి పోషించేందుకు తనకు ఇంట్రస్ట్‌ లేదని తేల్చి చెప్పేసింది. దీంతో మరో నటిని వెతికే పనిలో ఉన్నారు బాలీవుడ్ నిర్మాతలు. సౌత్‌లో టాప్‌ పొజిషన్‌లో కొనసాగుతున్న సామ్‌ ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే అది సిల్వర్‌ స్క్రీన్‌పై మాత్రం కాదు. మనోజ్‌ బాజ్‌పాయ్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2లో కీలక పాత్రలో నటించింది సామ్‌. ప్రస్తుతం తప్ప మరో సినిమాకు అంగీకరించని సమంత సినిమాల నుంచి షార్ట్‌ బ్రేక్‌ తీసుకునే ఆలోచనలో ఉందట. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YHT12x
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...