Wednesday, 11 December 2019

సౌత్‌లో `రౌడీ`నే టాప్‌.. విజయ్‌ దేవరకొండ ఖాతాలో మరో రికార్డ్‌

ఒక్క హిట్‌తోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న క్రేజీ హీరో . అర్జున్‌ రెడ్డి సినిమాతో బాలీవుడ్ జనాలను కూడా తనవైపు తిప్పుకున్న రౌడీ, ప్రతీ సినిమాకు తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రౌడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. 2019లో గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్‌ చేసిన తారల జాబితాలను రిలీజ్ చేసింది గూగుల్‌. ఈ లిస్ట్‌లో సౌత్‌ ఇండియాలో టాప్‌ స్టార్‌గా అవతరించాడు విజయ్‌ దేవరకొండ. ఈ ఏడాది డియార్‌ కామ్రేడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్‌ దేవరకొండ ఆశించిన స్థాయి విజయం సాధించికపోయినా తన క్రేజ్‌ను మాత్రం కాపాడుకోగలిగాడు. Also Read: తాజాగా ఈ రౌడీ లిస్ట్‌లో మరో అరుదైన గౌరవం వచ్చి చేరింది. 2019లో గూగుల్‌లో అత్యధిక మంది వెదికిన తారల జాబితాలో సౌత్‌లో టాప్‌లో నిలిచాడు విజయ్‌ దేవరకొండ. రజనీకాంత్, అజిత్‌, విజయ్‌, ప్రభాస్‌ లాంటి టాప్‌ స్టార్‌లను కాదని నెటిజెన్లు విజయ్‌ గురించి సెర్చ్‌ చేసేందుకు పోటి పడ్డారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్‌, ఇసా బెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్‌ డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించనున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read: ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు విజయ్‌. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాను చేసే ఆలోచనలో ఉన్నాడు విజయ్‌ దేవరకొండ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36CpY3x
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...