‘జబర్దస్త్’ ఫేం కథానాయకుడిగా నటించిన సినిమా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’. ధన్య బాలకృష్ణ కథానాయికగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుధీర్ ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో సుధీర్ పరువుపోయింది. అసలేం జరిగిందంటే.. ఓ యాంకర్ సుధీర్‌ను.. ‘ఈ సన్నివేశం ఇంకా బాగా చేసుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా?’ అని అడిగింది. ఇందుకు సుధీర్ స్పందిస్తూ.. ‘సినిమా అనే కాదు స్కి్ట్స్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా బాగా చేసుంటే బాగుండేది అని చాలా సార్లు అనిపించింది. నాకు నా యాక్టింగ్ ఎప్పుడూ అంత సంతృప్తికరంగా అనిపించలేదు. ఇక ఈ సినిమాలో నేను బాగా చేశాను అనిపించిన సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని రొమాంటిక్ సీన్లు చేస్తున్నప్పుడు కాస్త అసౌకర్యంగా అనిపించింది’ అన్నాడు. ఇందుకు యాంకర్ షాకై.. ‘మీకు అసౌకర్యంగా అనిపించిందా? ఏం సీన్లు సర్ అవి’ అంటూ సుధీర్‌ను ఎగతాళి చేసింది. యాంకర్ ఆ ప్రశ్న అడగడంతో పక్కనే ఉన్న ధన్య కూడా ఫక్కున నవ్వేసింది. దాంతో సుధీర్ పాపం తెగ సిగ్గుపడిపోయాడు. అంతేకాదు ఈ సినిమాలో ధన్య.. సుధీర్‌కు సీపీఆర్ చేసే సన్నివేశం ఒకటి ఉందట. ఆ సన్నివేశం ఉందని చెబితే సుధీర్‌కి ఒప్పుకోవడానికి ఏకంగా రెండు నెలలు సమయం పట్టిందట. దీని గురించి సుధీర్ మాట్లాడుతూ.. ‘సినిమాను చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు అందరూ చూస్తారు. అలాంటప్పుడు రొమాంటిక్ సన్నివేశాలు ఉండటం ఎందుకు అనిపించింది. ఆ సీన్లు లేకుండా కూడా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి’ అంటూ యాంకర్‌ని షాక్‌కు గురిచేశాడు. సుధీర్‌కి ప్లేబాయ్ అనే పేరుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ అమ్మాయి కనపడినా గోకకుండా ఊరుకోడు అని అంటుంటారు. తనని తానే ఓ ప్లేబాయ్‌గా మార్చుకున్నాడు సుధీర్. అలాంటిది అతని నోటి నుంచి రొమాంటిక్ సీన్లు చేస్తుంటే అసౌకర్యంగా అనిపించింది అన్న డైలాగ్ వినేవారికి అసౌకర్యంగా అనిపిస్తుందనే చెప్పాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YGWuP4
v
No comments:
Post a Comment