Sunday, 15 December 2019

‘తూటా’ దించడానికి వస్తోన్న ధనుష్.. గెట్ రెడీ!

కోలీవుడ్ స్టార్‌ ధనుష్‌ హీరోగా, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తోట’. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌ను తెలుగులో ‘తూటా’ పేరుతో విడుదల చేస్తున్నారు. గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి వారి బ్యానర్‌పై జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి ఈనెల 27న‌ విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. చిత్ర విడుదల తేదీ ప్రకటన సందర్భంగా నిర్మాతలు జి.తాతరెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్‌కు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ధనుష్‌కి కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండడం మాకు కలిసొచ్చే అంశం. ఇటీవల ఈ చిత్రం తమిళంలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’’ అని అన్నారు. కాగా, ఈ సినిమాలో ధనుష్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించారు. నిజానికి మేఘా ఆకాష్ తొలి చిత్రమిది. కాకపోతే సినిమా అనివార్య కారణాల వల్ల బాగా ఆలస్యమైంది. తమిళంలో గౌతమ్‌ మీనన్‌ స్వయంగా నిర్మించిన ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. దాదాపు రెండున్నరేళ్లుగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గౌతమ్‌ మీనన్‌. మొత్తానికి ఆయన ప్రయత్నాలు ఫలించాయి. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sq5cVY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...