Sunday, 15 December 2019

వర్మకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు.. తమ ఎదుట హాజరుకావాలని ఆదేశం

వివాదాస్పద దర్శకుడు, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సమర్పకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపారు. రేపు ఉదయం తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు ఈ నోటీసుల ద్వారా వర్మకు ఆదేశాలు జారీచేశారు. ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు వర్మకు ఈ నోటీసులు పంపారు. తన ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వర్మ పోస్ట్ చేశారని సైబర్ క్రైమ్ పోలీసులకు పాల్ ఫిర్యాదు చేశారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా నేపథ్యంలో వర్మ, కేఏ పాల్ మధ్య వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. సినిమాలో తనను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని, ఇది రెండు కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని కేఏ పాల్ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఒకరకంగా సినిమా విడుదలను మొదటిగా అడ్డుకున్నది కేఏ పాల్. అందుకే, ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాగానే వర్మ ట్విట్టర్‌లో ఒక ఫొటో పెట్టారు. ఆ ఫొటోలో కేఏ పాల్ ఫొటోను మార్ఫింగ్ చేశారు. దీనిపై వర్మ కోడలు బెగాల్ జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కేఏ పాల్ దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసి ఆర్జీవికి కేఏ పాల్ సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ 469 సెక్షన్ కింద పోలీసులు అప్పుడు కేసు నమోదు చేశారు. అయితే, ప్రస్తుతం ఆర్జీవీ హైదరాబాద్‌లో ఉండటంతో పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు. రేపు ఉదయం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట వర్మ హాజరుకావాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PMnIjl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...