Wednesday, 20 November 2019

‘ఆ నటిని పెళ్లి చేసుకోకు.. సెక్స్ కోసం కూతుర్ని అమ్మేస్తుంది’

సెలబ్రిటీలను టార్గెట్ చేసి వారిని ట్రోల్ చేయడం చాలా సులువు అనుకుంటూ ఉంటారు నెటిజన్లు. వారు కూడా మనుషులే, వారికీ మనసుంటుంది అని ఆలోచించకుండా నోటికొచ్చిన కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొందరు సెలబ్రిటీలు తమను ట్రోల్ చేసినవారిని బ్లాక్ చేస్తుంటారు. మరికొందరు మూతిపగిలేలా సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కామ్యా పంజాబీకి ఓ నెటిజన్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆల్రెడీ పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన కామ్యా.. ఆ తర్వాత తన భర్తతో విడిపోయింది. ఇప్పుడు మరో వ్యక్తితో ప్రేమలో ఉంది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ‘బిగ్ బాస్’ సీజన్ 13లో సిద్దార్థ్ శుక్లా అనే కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ కామ్యాపై కామెంట్ చేస్తూ.. ‘ఈ బేకార్ నటితో ఎందుకు డేటింగ్ చేస్తున్నారు? ఇతర మహిళలను తక్కువ చేసి మాట్లాడుతూ తన పరువు తానే తీసుకుంటోంది. సెక్స్ కోసం ఆమె తన కూతురిని కూడా అమ్మేసే టైప్’ అని కామెంట్ చేశాడు. దీనిపై కామ్యాకు కాబోయే భర్త స్పందిస్తూ.. ‘చూడూ.. నీకు దమ్ముంటే నీ ప్రొఫైల్ ఫొటో పెట్టి ఇలాంటి కామెంట్స్ చెయ్యి. ఓ మహిళ గురించి, అమాయకురాలైన ఆమె కూతురి గురించి ఇలా నీచంగా మాట్లాడే హక్కు నీకు లేదు. నీకు ట్రీట్‌మెంట్ చాలా అవసరం’ అని సమాధానమిచ్చాడు. ఈ కామెంట్‌పై కామ్యా కూడా స్పందించారు. ‘ఇలాంటి వెధవను ఏమనాలి. బహుశా అతని తల్లి కూడా సెక్స్ కోసం చిన్నప్పుడే అతన్ని అమ్మేసి ఉంటుంది. అందుకే ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు’ అని మండిపడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/334VdSz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...