Thursday, 10 October 2019

Sye Raa: స్టడీగా సైరా.. ఎనిమిదో రోజు కలెక్షన్స్‌ కెవ్వు కేక

మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన భారీ విజువల్ వండర్‌ . మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు దుమ్ములేపుతోంది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా ఎనిమిదో రోజు కూడా స్టడీగా కొనసాగుతోంది. ఈ సినిమా 8వ రోజున ఏకంగా 5 కోట్ల 80 లక్షల షేర్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో సైరా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ముఖ్యంగా నైజాంలో మెగాస్టార్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. భారీ వసూళ్లతో సాధించిన మెగాస్టార్‌ యంగ్ హీరోలకు సవాల్ విసిరాడు. ఇప్పటికీ సైరా స్టడీగా వసూళ్లు సాధిస్తుండటంతో ముందు ముందు మరిన్ని రికార్డ్‌లు తిరగరాయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌. అయితే తెలుగు, రాష్ట్రాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో కలెక్షన్లలు భారీగా పడిపోయాయి. Also Read: ముఖ్యంగా బాలీవుడ్‌లో సైరా వసూళ్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. టాక్‌ పరంగా ఓకె అనిపించిన వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో రాలేదు. కానీ మెగాస్టార్‌ చిరంజీవికి పట్టున్న సౌత్‌లో మాత్రం సైరా మంచి దూకుడు మీదుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడుల్లోనూ వసూళ్లు బాగున్నాయి. మెగాస్టార్ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో కనిపించారు. కన్నడ నటుడు సుధీప్‌, తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతిలు కీలక పాత్రల్లో నటించారు. Also Read: మిల్కీ బ్యూటీ తమన్నా లక్ష్మీ పాత్రలో ఆకట్టుకుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌తో ఎంతో ప్రస్టిజియస్‌గా ఈ సినిమాను రూపొందించారు మెగా ఫ్యామిలీ. అందుకు తగ్గ ఫలితం దక్కటంతో చిరు కుటుంబ సభ్యులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే వరుస సక్సెస్‌ పార్టీలతో ఖుషీ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2oygMfQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...