Thursday, 10 October 2019

‘రష్మిక మందనలా నేను అలా ముద్దులు పెట్టను, నా లిమిట్స్ తెలుసు’

ఒక హీరోయిన్‌కి మరో హీరోయిన్ పచ్చగిట్టదు అంటే ఇదేనేమో. ఒక హీరోయిన్‌ను మరో హీరోయిన్‌తో కంపేర్ చేస్తే అస్సలు భరించలేరు. ఈ చర్చంతా నటి గురించి. తెలుగులో ‘జై సింహా’, ‘తకిట తకిట’, ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే కన్నడ భాషలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె కన్నడలో ‘ఎల్లిడ్డే లిలీదంకా’ అనే చిత్రంలో నటించింది. ఇందులో సృజన్ లోకేష్ హీరోగా నటించారు. ఇందులో హరిప్రియ, సృజన్ మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంది. ఈ సీన్‌కు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది ఈ లిప్ లాక్ సీన్‌ను ‘గీత గోవిందం’లో రష్మిక మందన, విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్ ఒకేలా ఉన్నాయని పోలుస్తున్నారు. అయితే అలా పోల్చి చూడకండి అంటూ హరిప్రియ మండిపడింది. ‘నా ఫ్యాన్స్ పట్ల నాకు బాధ్యత ఉంది. వారు నా సినిమాలు చూడటానికి కుటుంబంతో కలిసి థియేటర్లకు వస్తారు. కాబట్టి నేను ఎంపిక చేసుకునే సినిమాలతో జాగ్రత్తగా ఉంటాను. ఈ సినిమాలో హీరోతో రొమాంటిక్‌గా ఉండాలి. కాబట్టి లిప్ లాక్ సీన్‌లో నటించడం తప్పలేదు. అలాగని నేనేమీ రష్మిక మందనలా ఘాటుగా లిప్ లాక్ ఇవ్వలేదు. అలాంటి సన్నివేశాలు ఉంటే నేను అసలు ఆ సినిమాలోనే నటించను’ అని తెలిపింది. రష్మిక మందన, విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలోనూ బోల్డ్ లిప్ లాక్ సీన్ ఉంది. ఈ సన్నివేశం గురించి మాట్లాడుతూ హరిప్రియ ఇన్‌డైరెక్ట్‌గా రష్మికకు పంచ్ వేసింది. రష్మికకు మాత్రం లిప్ లాక్ సీన్‌లో నటించాలన్న ఆత్రుత ఉంటుందా ఏంటి? హరిప్రియలాగే ఆమె కూడా స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టి విజయ్‌తో లిప్ లాక్ సీన్‌లో నటించింది. ఏదేమైనా లిప్ లాక్ సీన్లు లేకుండా ఇప్పుడు ఏ సినిమాలూ తెరకెక్కడం లేదు. ఇప్పుడిప్పుడు వస్తున్న హీరోయిన్లు ఆ సీన్లలో నటించడం కుదరదు అంటే వారు సినిమా నుంచి తప్పుకోవాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30YWPw9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...