Thursday, 10 October 2019

ఆ హీరోతో విడాకులు తీసుకున్నాక.. ఫొటోలు చూసి టెంప్ట్ అవ్వడమెందుకో..!

హృతిక్ రోషన్‌లాంటి భర్త రావాలని కోరుకోని అమ్మాయి ఉండదు. అందుకే ఆయన్ని అందరూ బాలీవుడ్ గ్రీక్ గాడ్ అని అంటూ ఉంటారు. అంతటి అందగాడిని పెళ్లి చేసుకునే అదృష్టం సుసాన్ ఖాన్‌కు దక్కింది. దాదాపు పేదళ్ల పాటు వీరి వైవాహిక జీవితం ఆనందంగా గడిచింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఏమైందో తెలీదు కానీ హృతిక్ రోషన్‌, సుసాన్‌కు మధ్య గొడవలు తలెత్తాయి. దాంతో ఇద్దరూ విడిపోయారు. కానీ పిల్లలికి తల్లిదండ్రుల అవసరం ఎంతో ఉంటుంది. అందుకే వారి కోసం అప్పుడప్పుడూ హృతిక్ రోషన్‌, సుసాన్ కలుస్తుంటారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం హృతిక్ రోషన్‌కు ఓ నటితో ఎఫైర్ ఉండడమే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. సుసాన్‌కి కూడా అర్జున్ రాంపాల్‌తో ఎఫైర్ ఉందని అన్నారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. హృతిక్ రోషన్‌, సుసాన్ విడిపోయినప్పటికీ వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకర్నొకరు తిట్టుకోవడం వంటివి లేవు. చెప్పాలంటే హృతిక్ రోషన్‌ అంటే ఇప్పటికీ సుసాన్‌కి ఎంతో నమ్మకం. ఎవరెన్ని చెప్పినా ఆమె హృతిక్ రోషన్‌కే మద్దతు తెలుపుతోంది. అంతేకాదు హృతిక్ రోషన్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలపై కూడా స్పందిస్తోంది. తాజాగా హృతిక్ రోషన్‌ తాను నటించిన ‘వార్’ సినిమాలోని ఓ స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటో చూసి సుసాన్ ‘ఉఫ్..’ అంటూ టెంప్ట్ అవుతున్నాననే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు వార్ సినిమాకు ఆమె కూడా కావాల్సినంత మైలేజ్ ఇచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే.. భర్తపై అంత ప్రేమున్నప్పుడు అతనితో విడిపోవడం ఎందుకు? అతను పోస్ట్ చేసే ఫొటోలు చూసి టెంప్ట్ అవ్వడం ఎందుకు? అతని సినిమాలకు ప్రచారం కల్పించడం ఎందుకు? ఈ ప్రశ్నలన్నీ నెటిజన్లు, అభిమానులు అడుగుతున్నవే. హృతిక్ రోషన్‌, సుసాన్ విడిపోయారన్నమాటే కానీ వారిద్దరినీ చూసినవాళ్లకు ఆ విషయం అర్థంకాదు. అంత అన్యోన్యంగా ఉంటారు. ఇప్పటికీ ఒకరిపై ఒకరికి ఇంత అభిమానం, గౌరవం ఉన్నప్పుడు కలిసిపోవచ్చు కదా అని చాలా మంది సన్నిహితులు వారికి చెప్పి చూశారు. వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకుని ఒక్కటూపోవాలనుకుంటున్నారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అదేంలేదని సుసాన్ స్పష్టం చేశారు. ఏదేమైనా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు కాబట్టి సుసాన్, హృతిక్ రోషన్‌ కలిసిపోతేనే మంచిదని అభిమానులే కాదు ఇండస్ట్రీలోని సన్నిహితులు కూడా ఆశిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OH4DzQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...