Thursday, 10 October 2019

Rakul: హ్యాపీ బర్త్‌డే గార్జియస్‌ బ్యూటీ రకుల్‌

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగుతున్న అందాల భామ రకుల్‌ ప్రీత్ సింగ్‌. చిన్న సినిమాల హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ హీరోల సరసన లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఇటీవల తెలుగులో కాస్త స్లో అయినా తమిళ, హిందీ సినిమాలతో దూసుకుపోతోంది రకుల్‌. కన్నడ సినిమా గిల్లితో వెండితెరకు పరిచయం అయిన రకుల్, తరువాత కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. వెంటనే కోలీవుడ్ లోనూ అడుగుపెట్టేసింది అయితే ఈ భామకు తొలి సక్సెస్‌ రావటానికి మాత్రం చాలా సమయమే పట్టింది. 2009లో వెండితెరకు పరిచయం అయిన రకుల్ బ్రేక్‌ కోసం 2013 వరకు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో రకుల్‌ ఖాతాలో తొలి సక్సెస్‌ పడింది. Also Read: తెలుగులో సినిమాలు చేస్తూనే తమిళ, హిందీ భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఇతర భాష ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా టాలీవుడ్‌ జనాలు మాత్రం రకుల్‌కు సింహాసనం వేసి కూర్చోబెట్టారు. చిన్న సినిమాలతో భారీ కెరీర్‌ మొదలు పెట్టిన ఈ భామ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోల సరసన సినిమాలు చేసే స్థాయికి వచ్చింది. బ్రూస్‌ లీ సినిమాలో రామ్‌ చరణ్‌తో జోడి కట్టిన రకుల్ వెంటనే ఎన్టీఆర్‌ సరసన నాన్నకు ప్రేమతో సినిమాలో అలరించింది. తరువాత ధృవ, సరైనోడు సినిమాలతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌లను చూసింది. ధృవ తరువాత అమ్మడికి అవకాశాలు వచ్చినా సక్సెస్‌లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఒక్క రారండోయ్ వేడుక చూద్దాం తప్ప మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడ్డాయి. Also Read: ముఖ్యంగా నాగార్జున సరసన రకుల్‌ నటించిన మన్మథుడు 2 డిజాస్టర్ కావటంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ హిందీ తమిళ సినిమాలతో రకుల్ బిజీగానే ఉంది. ప్రజెంట్‌ కెరీర్‌ ఆశాజనకంగా లేకపోయినా ఒక్క హిట్ పడితే మరోసారి బాక్సాఫీస్‌ను ఏలేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌. కెరీర్‌ ఎలా ఉన్నా బిజినెస్‌ రంగంలో రకుల్‌ దూసుకుపోతోంది. ఇప్పటికే సిటీలో జిమ్‌లను ఓపెన్‌ చేసిన ఈ భామ తన తమ్ముడ్ని కూడా హీరోగా లాంచ్‌ చేస్తోంది. నటిగా, బిజినెస్‌ ఉమెన్‌గా సత్తా చాటుతున్న రకుల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది సమయం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VvJKt1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...