Thursday, 3 October 2019

మహేష్ బాబు‌కి రిలీజ్‌కి ముందే షాకిచ్చిన సరిలేరు నీకెవ్వరు

భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవాలి అని ఫిక్స్ అయ్యి అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా స్టార్ట్ చేసాడు. ఆ సినిమా స్టార్ట్ అయినదగ్గరనుండి కూడా ఆల్మోస్ట్ నాన్ స్టాప్‌గా షూటింగ్ చేషున్నారు. సంక్రాంతి కానుకగా ఆ సినిమా రిలీజ్ అవుతుంది అన్నారు. కానీ మళ్ళీ సమ్మర్ రిలీజ్‌కి వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు టాక్. అయితే ఆ సినిమా రిలీజ్‌కి ముందే మహేష్ బాబుకి షాకిచ్చిందట. ఎందుకంటే ఈ సినిమాకోసం రెమ్యునరేషన్‌గా మహేష్ బాబు నాన్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాడు అని టాక్. అందుకే ఈ సినిమా ప్రొడక్షన్‌లో తన ప్రొడక్షన్ హౌస్ అయిన జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ని కూడా భాగస్వామిగా చేర్చాడు అని మాట్లాడుకున్నారు. Also Read: భరత్ అనే నేను సినిమా నుండి మహేష్ బాబు సినిమాల నాన్ థియేట్రికల్ రైట్స్ బాగా పెరిగాయి. ఇక మహర్షికి అయితే ఆ రైట్స్ 50 కోట్లు దాటాయి. దాంతో సరిలేరు నీకెవ్వరు సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా 50 కోట్లుగా లెక్కకట్టి దాన్ని మహేష్ రెమ్యునరేషన్‌గా ప్రచారం చేసారు. అయితే ఆ నాన్ థియేట్రికల్ రైట్స్‌లో సగం పైనే హిందీ వెర్షన్ డబ్బింగ్ రైట్స్ నుండి వస్తుంది. మొన్నటివరకు ఈ రైట్స్ చాలా లిబరల్‌గా ఉండేవి. సినిమా తెలుగులో ఎలా పెర్ఫార్మ్ చేసినా కూడా పర్లేదు, పైగా సినిమాలో పెద్దగా తెలిసిన వాళ్ళు లేకపోయినా కూడా ఒకటి రెండు ఫైట్స్ ఉంటే మాత్రం బాగానే రేటు గిట్టుబాటు అయ్యేది. Also Read:

ఇప్పుడు మాత్రం హిందీ సినిమాలు కొనేవాళ్ళు కూడా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. అనవసరంగా పోటీకి పోయి రేటు పెంచేసాం అని రియలైజ్ అయ్యి ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యారట. దాని ఫలితంగా ఇప్పుడు ఒక సినిమా కొనాలంటే వాళ్ళు పెడుతున్న అగ్రిమెంట్‌కి సినిమా అమ్మేవాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందట. లేటెస్ట్‌గా గద్దలకొండ గణేష్ సినిమా ప్రొడ్యూసర్స్‌కి కూడా హిందీ సినిమా అగ్రిమెంట్‌లోని ఒక కండిషన్‌ని ఉల్లంఘించినందుకు కోటిన్నరవరకు ఫైన్ పడింది అని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. Also Read:

అందుకే ఇప్పుడు పెద్ద సినిమాలు అమ్మాలి అంటేనే భయపడుతున్నారు.తెలుగు సినిమా సగంలో ఉండగానే సేల్ అయిపోయే రైట్స్ ఇప్పుడు మాత్రం ఎవ్వరూ అడగట్లేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా శాటిలైట్ రైట్స్ ద్వారా పాతిక కోట్లు ఎక్స్పెక్ట్ చేసిన నమ్రత కూడా ఇప్పుడు ఎలా మూవీ అవ్వాలో తెలియని స్టేజ్‌లో ఉండిపోయిందట. ఆ రకంగా సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కి ముందే మహేష్ బాబు కి షాక్ తగిలింది. మరి నెక్స్ట్ సినిమాకి రెమ్యునరేషన్ విషయంలో ఎలా ప్రొసీడ్ అవుతాడో చూడాలి.



from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2pAhv0o
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...