Saturday, 26 October 2019

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్: కొడుక్కి పప్పు వడ్డిస్తున్న బాబు!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ వచ్చేసింది. దాదాపు మూడు నిమిషాల నిడివితో వర్మ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం వివాదాస్పదంగానే ఉంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ వర్మ తన కాంట్రవర్సీ మార్క్ చూపించారు. ‘బ్రేకింగ్ న్యూస్.. మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ.. చరిత్రలోనే ఎవరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి’ అంటూ ఏపీ రాజకీయ పరిస్థితుల్ని హింసాత్మకంగా చూపించారు వర్మ. ‘ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడు’ అని చంద్రబాబు పాత్రధారి.. ‘ఇక ప్రశ్నించే ప్రసక్తిలేదు.. చేయడమే’ అని పవన్ పాత్రధారి చెప్తున్న డైలాగ్స్ ఆయ పార్టీల్లో మంటపుట్టించేవిగా ఉన్నాయి. ఇక డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్న లోకేష్ బాబు పాత్రధారి ఏడుస్తూ అన్నం తింటూ ఉంటే.. చంద్రబాబు పాత్రధారి పప్పు వడ్డించడాన్ని బట్టి వర్మ లోకేష్‌ని గట్టిగానే టార్గెట్ చేశారు. ఇక ఈ ట్రైలర్‌లో అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రధానంగా ఈ ట్రైలర్‌లో చూపించారు. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించగా.. వర్మ రచన, సహ దర్శకత్వం వహించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WfdiLV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...