Saturday, 26 October 2019

సల్మాన్.. బట్టలు విప్పేసి ఇలా కూడా విషెస్ చెప్తారా?

బాలీవుడ్ సూపర్‌స్టార్ ఏం చేసినా కొత్తగానే ఉంటుందని మరోసారి రుజువైంది. సల్మాన్‌కి తన 8 ప్యాక్ బాడీనే అందం. అందుకే వారానికి ఒకసారైనా జిమ్‌కి వెళ్లినప్పుడు షర్ట్ లేకుండా దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తుంటాడు. ఈరోజు బావమరిది ఆయుష్ శర్మ బర్త్‌డే. ఈ సందర్భంగా సల్మాన్ అతనికి విష్ చేసిన తీరు వైరల్ అవుతోంది. ఆయుష్ శర్మ, సల్మాన్ ఖాన్, జహీర్ ఇక్బాల్ కలిసి షర్టు లేకుండా ఓ బల్లపై తల దించుకుని ఒకే స్టిల్‌లో ఫొటో దిగారు. ఈ ఫొటోను సల్మాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆయుష్‌కు విషెస్ చెప్పాడు. ఈ ఫొటోలో మధ్యలో ఉన్న వ్యక్తి సల్మాన్. ఎందుకంటే సల్లూభాయ్ లాంటి బాడీ బాలీవుడ్‌లో ఎవ్వరికీ లేదు. ఆయన బాడీకి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఆయుష్ విషయానికొస్తే.. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్‌ను ఆయుష్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అర్పితా సల్మాన్‌కు సొంత చెల్లి కాదు. సల్మాన్ తండ్రి సలీమ్‌కు అర్పిత రోడ్డుపై దొరికింది. దాంతో ఆమెను దత్తత తీసుకుని కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాడు. దిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ శర్మ కుమారుడైన ఆయుష్. అర్పితాల వివాహం హైదరాబాద్‌లోని ప్రముఖ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరికి ఒక కుమారుడు. బర్త్‌డే వేడుకల కోసం ఆయుష్‌ తన కుటుంబంతో కలిసి మాల్దీవ్స్‌ వెళ్లాడు. ఆయుష్‌ను ‘లవ్ యాత్రి’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం చేశాడు సల్మాన్. అయితే ఆశించినంత స్థాయిలో సినిమా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ‘క్వత’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో ఆయుష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా సల్మాన్‌కు తగ్గ బావమరిది అనిపించుకుంటాడో లేదో వేచి చూడాలి. మరోపక్క సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘దబాంగ్’ సిరీస్ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. ప్రభుదేవా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3693988
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...