Saturday, 26 October 2019

షాహిద్.. నాని పేరు మాత్రం చెడగొట్టకు

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌కు రీమేక్‌లు బాగా కలిసొస్తున్నాయి. తెలుగులో మంచి విజయం అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో తెరకెక్కించారు. ఇందులో కథానాయకుడిగా నటించారు. సినిమా ఎంత వివాదాస్పదమైందో అంతకంటే ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు అదే నమ్మకంతో ‘జెర్సీ’ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కూడా షాహిద్ కపూరే నటించనున్నాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్‌ను కూడా తెరకెక్కింనున్నాడు. ఇందులో శ్రద్ధా కపూర్‌ను కథానాయికగా ఎంపిక చేసుకోవాలని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. మరి కబీర్ సింగ్ సినిమాలాగే షాహిద్ జెర్సీ రీమేక్‌కు కూడా న్యాయం చేయగలడా? నాని ఇమేజ్‌ను ఎక్కడా డ్యామేజ్ చేయకుండా సినిమా చేయగలడా? జెర్సీ రీమేక్‌ను ప్రకటించగానే సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలివి. బ్రో.. నాని పరువు మాత్రం తీయకు అంటూ పలువురు అభిమానులు కామెంట్లు కూడా చేశారు. అన్ని రీమేక్ సినిమాలు హిట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. అలాగని ఫ్లాప్ అవుతాయని కూడా లేదనుకోండి. కానీ కబీర్ సింగ్‌కి జెర్సీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకటేమో లవ్ ఫెయిల్యూ్ర్, ఆల్కహాల్ ఎడిక్షన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినది, మరొకటి కుటుంబం, ప్రేమ, కెరీర్ ఇలా ఓ ఎమోషనల్ రైడ్‌తో సాగేది. కబీర్ సింగ్ సక్సెస్ నుంచి షాహిద్ పూర్తిగా బయటికి వస్తే కానీ జెర్సీ రీమేక్‌లోని తన పాత్రలో ఒదిగిపోలేడు. ఈ సినిమాను రీమేక్ చేయకపోవడమే మంచిదని పలువురు సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే కొన్ని సినిమాలు ఒక్కసారి తీస్తేనే బాగా వస్తాయి. రెండోసారి తీస్తే మొదటిసారి వచ్చినంత బాగా రాదు. జెర్సీలో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. వీరిద్దరిదీ కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారు. కానీ షాహిద్, శ్రద్ధా కపూర్ ఇదివరకే ‘బత్తీ గుల్ మీటర్ చాలూ’ అనే ఫ్లాప్ సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే కాస్త ఆలోచించాల్సిందే. లక్ కలిసొచ్చి షాహిద్‌కు ఈ రీమేక్‌ కూడా హిట్ అయితే ఆయన కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కినట్లే. అసలే కబీర్ సింగ్‌కి ముందు వరకు వరుస ఫ్లాప్స్‌తో షాహిద్ సతమతమయ్యాడు. ఇప్పుడిప్పుడే ట్రాక్‌లోకి వస్తున్నాడు. మరి జెర్సీ రీమేక్‌ను జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురాగలడో లేదో వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36bC8Ra
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...