Wednesday, 25 September 2019

Rajasekhar: వేణు మాధవ్ చివరి ఫొటో గుర్తుపట్టలేనంతగా.. రాజ శేఖర్ భావోద్వేగం

హాస్య నటుడు అకాల మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్‌కు కిడ్నీలు కూడా చెడిపోవడంతో సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కాగా వేణు మాధవ్‌తో ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరితో ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలు, కమెడియన్లు సీనియర్ నటీ నటులు, రాజీకీయ సినీ రంగ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వేణు మాధవ్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుని ఎమోషన్ అయ్యారు సీనియర్ హీరో, ‘మా’ వైస్ ప్రెసిడెంట్ . వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటన్నారు రాజశేఖర్. ఒక నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా వేణు మాధవ్ తనకు మంచి స్నేహితుడన్నారు. వరుసలు పెట్టి పిలుచుకునేంత చనువు అతనితో ఉందని.. నన్ను బాబా అని, జీవితను అక్క అంటూ ఆప్యాయంగా పిలిచే వారన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏ చిన్న విషయం అని వేణు వెంటనే స్పందించేవారు. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లోనూ ఆయనకు హెల్త్ బాలేకపోయినప్పటికీ పోటీ చేసి ఈసీ మెంబర్‌గా గెలుపొందారన్నారు. సాటి కళాకారులకు సాయం చేయాలని తపన పడే వేణు మాధవ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం అన్నారు రాజశేఖర్. తరచుగా ఫోన్ చేసి మాట్లాడేవాడని.. ప్రతి పంగక్కి వేణు మాధవ్ ఫోన్ చేసి మరీ విషెష్ చేసేవాడు. అయితే వారం రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్‌కి వెళ్లి కలిశాను.. ఆయన కోలుకుని సోమవారం సాయంత్రం డిశార్జ్‌ అయ్యారు. అప్పుడు చాలా యాక్టివ్‌గానే పలకరించారు. అనుకోకుండా మళ్లీ మళ్లీ ఆయనకు సీరియస్ అయ్యింది. మంగళవారం నాడు హాస్పటల్‌లో అడ్మిట్ అయ్యి తిరిగిరాని లోకాలకు వెళ్లారు’ అంటూ వేణు మాధవ్‌తో చివరిగా దిగిన ఫొటోను షేర్ చేశారు రాజశేఖర్. ఇందులో వేణు మాధవ్ అసలు గుర్తు పట్టలేనంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mzVGfT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...