Thursday, 5 September 2019

‘వార్’ సాంగ్.. గుండెలో తూట్లు పొడుస్తోన్న హాట్ బ్యూటీ

నేటితరం బిగ్గెస్ట్ యాక్షన్ సూపర్ స్టార్స్‌గా అభిమానులతో పిలుపించుకుంటోన్న హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘వార్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ - శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరుచుకున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. గురుశిష్యుల మధ్య జరిగే పోరే ఈ ‘వార్’. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ నెగిటివ్ షేడ్ ఉన్న కబీర్ అనే పాత్రలో నటిస్తుండగా.. టైగర్ ష్రాఫ్ పోలీసు అధికారి ఖాలిద్‌గా కనిపించనున్నారు. కబీర్‌ను ఖాలిద్ పట్టుకునే క్రమంలో ఎదురైన పరిణామాలేంటి, అసలు ఈ సినిమా కథేంటి తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే. కబీర్, ఖాలిద్ మధ్య ‘వార్’ ఎలా ఉండబోతోందో ట్రైలర్ సూచన ప్రాయంగా చెప్పారు. ఇక రిలీజ్ రోజు వెండితెర ఊగిపోవడం ఖాయం. Also Read: ఇదిలా ఉంటే, చిత్ర ప్రచారంలో భాగంగా ‘వార్’లోని తొలిపాటను గురువారం విడుదల చేశారు. ‘గుండెలో తూట్లు పడే’ అంటూ సాగే ఈ పాట చాలా బాగుంది. హిందీ పాటే అయినా తెలుగు సాహిత్యాన్ని బాగానే మ్యాచ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ పాటను హృతిక్ రోషన్, వాణి కపూర్‌పై చిత్రీకరించారు. ఈ పాటలో వాణీ కపూర్ చాలా హాట్‌గా ఉంది. బీచ్‌లో అందాలు, విశాల్ - శేఖర్ ఫాస్ట్ బీట్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఈ పాటను రాహుల్ వైద్య, అనుషా మణి ఆలపించారు. చైతన్య ప్రసాద్ తెలుగు సాహిత్యం అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZCgA0w
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...