Tuesday, 17 September 2019

పిల్లల్ని కనాలా.. బాబోయ్ నా వల్ల కాదు: నటి మల్లికా షెరావత్

అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి ఆడపిల్లకీ ఉంటుంది. ఇందుకు సెలబ్రిటీలు ఏ మాత్రం తీసిపోరు. సంతానం కలగకపోయినా ఐవీఎఫ్, సరోగసీల పద్ధతుల ద్వారానైనా పిల్లల్ని కనాలనుకుంటున్నారు. కానీ బాలీవుడ్ బ్యూటీ మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నారు. అసలు తనకు పిల్లలే వద్దంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనకు తన సోదరుడి కుమారుడు రణ్‌షేర్ అంటే ఎంతో ప్రాణం. గంటల తరబడి వాడితో ఆడుకుంటూ ఉంటానని చెప్పారు. అయితే తనకు పుట్టబోయే పిల్లల గురించి మాట్లాడుతూ.. ‘నేను నా మేనల్లుడు రణ్‌షేర్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నాను. నాకు పిల్లలు లేరు కాబట్టి రణ్‌షేర్‌నే కొడుకుగా చూసుకుంటున్నాను. వాడితో గంటల తరబడి ఆడుకుంటాను. విహారయాత్రలకు తీసుకువెళుతూ ఉంటాను. అయితే నా మాత్రం పిల్లలు వద్దనే చెబుతాను. ఎందుకంటే అది ఎంతో బాధ్యతతో కూడిన ప్రక్రియ. అది నాకొద్దు. చెప్పాలంటే పిల్లల్ని కనాలన్న ఆలోచన కూడా నాకు భయంగా ఉంది. ఇప్పుడు నాకు ఎక్కడికి కావాలంటే అక్కడికి సూట్‌కేస్ సర్దుకుని వెళ్లిపోవచ్చు. కానీ పిల్లలు పుడితే ప్రతి క్షణం వారి గురించే ఆలోచించాలి. వారిని ఏ స్కూల్లో వేయాలి ఎక్కడ చదివించాలని అన్న ఆలోచనలతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్న జీవితం నాకు చాలు’ అన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారవేత్త సిరిల్ ఆక్సెన్‌ఫాతో మలైకా కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే మళ్లీ తనకు ప్రేమలో పడాలని ఉందని అంటున్నారు. ‘ఇప్పటికైతే నేను సింగిల్‌గానే ఉన్నా. ప్రేమలో పడాలని ఉంది. మన ఇండస్ట్రీలో సింగిల్‌గా జీవితాన్ని గడుపుతున్న ఎందరో నటీమణులు ఉన్నారు. రేఖాజీ ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నారు. ఇప్పటికీ సింగిల్ జీవితాన్ని గడుపుతున్న నటీమణులపై తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ‘వీరిని ఎవరు పెళ్లి చేసుకుంటారు’ అని వెక్కిరిస్తున్నవారూ ఉన్నారు. కానీ నేను వాటి గురించి పట్టించుకోను. నాకు నచ్చినట్లుగా నా జీవితాన్ని గడుపుతున్నాను’ అని వెల్లడించారు. మల్లికా బాలీవుడ్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. ఆమను ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాల కోసం ఎంపిక చేసుకునేవారు. అయితే తనకు నోరెక్కువని చాలా మంది హీరోలు తనను సినిమాల్లో నుంచి తప్పించారని ఓ సందర్భంలో మల్లిక తెలిపారు. తన స్థానంలో హీరోలు తమ గర్ల్ ఫ్రెండ్స్‌కు ఛాన్స్‌లు ఇప్పించేవారని ఆరోపించారు. అలా తాను దాదాపు 30 సినిమాలు పోగొట్టుకున్నానని చెప్పారు. చాలా కాలం తర్వాత ‘బూ సబ్కీ ఫటేగీ’ అనే వెబ్ సిరీస్‌తో మలైకా బాలీవుడ్‌లో మెరిశారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు రజత్ కపూర్‌తో ఓ సినిమా చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/308GoAQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...