‘నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే నా సినిమాలు చూడండి’ అంటున్నారు ప్రముఖ నటుడు మాధవన్. ఇలా ఆయన ఎందుకు అన్నారంటే.. లతా శ్రీనివాసన్ అనే నెటిజన్ మాధవన్‌కు ట్వీట్ చేస్తూ.. ‘నిద్రలేమికి పరిష్కారం చెప్పండి’ అని అడిగారు. ఇందుకు స్పందిస్తూ.. ‘నేను పూర్తిగా లీనమైపోయి నటించిన కొన్ని సినిమాలను చూడండి’ అంటూ తనదైన శైలిలో చమత్కరించారు. మాధవన్ ఫన్నీ రిప్లైపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ‘మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి మాధవన్. మీరు చాలా మంచి సినిమాల్లో నటించారు. మీ సినిమా చూస్తే మాకు నిద్ర పట్టదు’ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఓ యువతి నుంచి మరో ట్వీట్ వచ్చింది. ఆ యువతి మాధవన్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఎంత హాట్‌గా ఉన్నారో.. నాకు ఏడవాలని ఉంది. మాధవన్ మీరెందుకు ఇంత హాట్‌గా ఉన్నారు’ అని ప్రశ్నించారు. ఇందుకు మాధవన్ సమాధానమిస్తూ.. ‘ఇది రెండేళ్ల క్రితం దిగిన ఫొటో. నాకూ ఏడుపొస్తోంది. ఇలాంటి లుక్‌ను మళ్లీ పొందాలని ఉంది’ అని పేర్కొన్నారు. నాలుగు పదుల వయసులోనూ మాధవన్‌కు ఫీమేల్ ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. కొన్ని రోజుల క్రితం ఓ యువతి ఏకంగా తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా మాధవన్‌ను అడిగింది. ఇందుకు మాధవన్.. ‘మీకు నాకంటే మంచి వ్యక్తి దొరుకుతాడు’ అని బదులిచ్చారు. చెప్పాలంటే తనకు రెండు పదుల వయసులో కంటే నాలుగు పదుల వయసులోనే ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువయ్యారని ఒకానొక సందర్భంలో చెప్పారు. ఇప్పటికీ ఆయన నటించిన ‘చెలి’, ‘సఖి’ సినిమాలు ఎవర్‌గ్రీనే. ఈ సినిమాల్లోని పాటలు ఇప్పటి యువత మనసులోనూ బలంగా నాటుకపోయాయి. మాధవన్‌ను ఇప్పటికీ లవర్ బాయ్‌గా చూసే అవకాశం ఉంది. కానీ ఆయన రియల్ లైఫ్ బేస్డ్ కథలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుత సమాజంలో ప్రేక్షకులకు ఈ సినిమాలను చూపించడమే ఉత్తమం అన్నది ఆయన అభిప్రాయం. అందుకే ఆయన ఎక్కువగా కమర్షియల్ సినిమాలను ఓకే చేయడంలేదు. చాలా కాలం తర్వాత ఆయన తెలుగులో నేరుగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో ఆయన విలన్ పాత్రను పోషించారు. ప్రస్తుతం మాధవన్ ‘రాకెట్రీ- ది నంబీ ఎఫెక్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో మాధవన్ నారాయణ్ పాత్రలో నటిస్తున్నారు. సినిమాకు మాధవనే దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31xKvDV
v
No comments:
Post a Comment