Tuesday, 17 September 2019

అల్లు అరవింద్ ‘రామాయణం’: రావణుడిగా ప్రభాస్.. రాముడిగా హృతిక్!

టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ‘రామాయణం’ ప్రాజెక్ట్‌ను రెండు నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రామాయణ మహాకావ్యంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తీసుకొని తెరపై ఆవిష్కరించారు. అయితే, తొలిసారి మొత్తం రామాయణాన్ని మూడు భాగాలుగా అది కూడా 3డి టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ రామాయణాన్ని తెరకెక్కించనున్నారు. ఈ భారీ చిత్రం నిర్మాణం కోసం మధు మంతెన, నమిత్ మల్హోత్ర (ప్రైమ్ ఫోకస్)తో అల్లు అరవింద్ జతకట్టారు. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. తొలి భాగం 2021లో విడుదలవుతుంది. అయితే, తొలిభాగాన్ని నితీష్ తివారి తెరకెక్కించనున్నారు. ‘దంగల్’ తరవాత తాజాగా ‘చిచ్చోరి’ లాంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న తివారి ప్రస్తుతం ‘రామాయణం’ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. Also Read: ఇదిలా ఉంటే, ఈ సినిమాలో బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్ రాముడిగా, దీపికా పదుకొణె సీతగా నటించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఈ భారీ చిత్రంలో ప్రభాస్ కూడా నటించనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రావణుడి పాత్రలో ప్రభాస్‌ను నటింపజేయాలని మేకర్స్ చూస్తున్నారట. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రూ.600 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ఇది హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా తెరకెక్కనుంది కాబట్టి పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే సినిమాకు బలం చేకూరుతుందని మేకర్స్ భావించారని సమాచారం. Also Read: రామాయణంలో ఎంతో కీలకమైన రావణుడి పాత్రకు ప్రభాస్ అయితే కరెక్ట్‌గా సరిపోతారని దర్శక నిర్మాతలు నిర్ణయించారట. అయితే, ఇది ఇంకా చర్చల దశలో ఉందని అంటున్నారు. ఈ విషయంలో ప్రభాస్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదట. ఒకవేళ ప్రభాస్ గనుక ఈ పాత్ర చేయడానికి ముందుకొస్తే భారత సినీ చరిత్రలో ఇది మరో సంచలనాత్మక చిత్రం కావడం ఖాయం. ఇదిలా ఉంటే, చిత్ర తారాగణం విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దర్శకుడు నితీష్ తివారి అంటున్నారు. ఇటీవల ‘పింక్‌విల్లా’ వెబ్‌సైట్‌తో మాట్లాడిన ఆయన తాము ఇంకా కాన్సెస్ట్ లెవెల్‌లోనే ఉన్నామని చెప్పారు. తారాగణం గురించి ప్రస్తుతానికి ఆలోచించడం లేదని అన్నారు. దర్శకుడు ఇలా చెబుతున్నప్పటికీ లోపల అయితే చర్చలు జరుగుతున్నాయన్నది టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31wHsfo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...