Tuesday, 17 September 2019

Vivek Oberoi: అభిషేక్‌కి ఐష్ మాజీ ప్రియుడి విషెస్.. జరిగిందంతా మర్చిపోతారా?

కాలు జారితే వెనక్కి తీసుకోగలం. కానీ నోరు జారితే దాని వల్ల కలిగే పరిణామాలను ఊహించలేం. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌కు ఇప్పటికే ఈ విషయం అర్థమై ఉంటుంది. ఎక్కడ ఏది మాట్లాడాలో.. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో సెలబ్రిటీలకు బాగా తెలుసు. కానీ ఏదో సరదాగా ట్వీట్ చేస్తే పోలా అనుకున్న వివేక్‌కు ఇతర సినీ ప్రముఖులు బాగా బుద్ధి చెప్పారు. ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే.. వివేక్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. చాలా కాలం తర్వాత అభిషేక్.. ‘ది బిగ్ బుల్’ అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు వివేక్ ట్వీట్ చేశారు. ఇందులో విషయం ఏముంది అనుకుంటున్నారా? అయితే ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లా్ల్సిందే. ఒకప్పుడు , వివేక్ ఒబెరాయ్ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత ఐష్ సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేశారు. ఇది కూడా సెట్ అవ్వలేదు. మొత్తానికి ఐష్, అభిషేక్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో పోల్ రిజల్ట్, ఎగ్జిట్ పోల్స్ అంటూ వివేక్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో ఐష్ వివేక్‌తో, సల్మాన్‌తో, అభిషేక్‌తో కలిసి ఉన్నారు. దాంతో సినీ ప్రముఖులు వివేక్ చీప్ పోస్ట్‌పై ధ్వజమెత్తారు. వారి టార్చర్ తట్టుకోలేక వివేక్ ఆ ఫొటో డిలీట్ చేసి సారీ చెప్పారు. అయితే ఈ ఫొటో విషయంపై ఐష్ కానీ అభిషేక్ కానీ స్పందించలేదు. అభిషేక్‌తో ఎలాగైనా మంచిగా మెలగాలని నిర్ణయించుకున్న వివేక్ ఈరోజు ఆయన సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ విష్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వివేక్ ఇంతవరకూ మరో ప్రాజెక్ట్‌ గురించి ప్రకటించలేదు. మున్ముందు ఆయన చేయబోయే సినిమాలకు ఎక్కడ సహ నటీనటులు సపోర్ట్ చేయరోనన్న ఉద్దేశంతో వివేక్.. అభిషేక్‌కు మంచి జరగాలని కోరుకుంటూ ట్వీట్ చేసి ఉండొచ్చు. ఏదేమైనా గతంలో జరిగిన చెడు అనుభవాలను సెలబ్రిటీలు అంత త్వరగా మర్చిపోలేరు కదా..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Nl4ani
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...