Wednesday, 18 September 2019

అనుష్కా.. సెట్స్‌లో ఆ ఆవలింతలేంటమ్మా? బ్యూటీ సమాధానమేంటో చూడండి..

స్యాథాయక్టింగ్ స్కిల్స్‌తో పాటు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న నటి . చాలా నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో బీటీఎస్ (బిట్వీన్ ది షూట్) వీడియోను షేర్ చేశారు. ఓ పక్క ఫొటోలకు పోజులిస్తూ మరోపక్క అనుష్క ఆవలిస్తున్నట్లుగా వీడియోలో కనిపించారు. దాంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ‘పనిలో ఉన్నప్పుడు ఆ ఆవలింతలేంటమ్మా అనుష్క’ అంటూ నెటిజన్లు సరదాగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందుకు అనుష్క సమాధానం ఇస్తూ.. ‘నో.. నేను ఆవలించడంలేదు’ అని చెప్పారు. అయితే బాగా అలసిపోయినట్లుగా అనుష్క ఆవలిస్తు్ండడం వీడియోలో క్లియర్‌గా తెలుస్తోంది. మరి ఆవలించడంలేదని అనుష్క అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారో ఆమెకే తెలియాలి. చివరిగా ‘జీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అనుష్క. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ప్రధాన పాత్రలను పోషించారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావొస్తోంది. ఇంతవరకు అనుష్క తన తర్వాతి సినిమా గురించి ప్రకటించలేదు. తన భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి క్రికెట్ మ్యాచ్‌లకు హాజరవుతూ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆమె ప్రస్తుతం ఆన్‌స్క్రీన్ వర్క్‌పై కాకుండా ఆఫ్‌స్క్రీన్ వర్క్‌పై దృష్టిసారిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం తన సోదరుడు కర్ణేశ్ శర్మతో కలిసి క్లీన్ స్లేట్ ఫిలింస్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి ‘ఎన్ హెచ్ 10’, ‘ఫిల్లోరి’, ‘పరి’ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అంతేకాదు తాను నిర్మించే సినిమాల్లో అనుష్క కొత్త వారికి అవకాశాలు ఇస్తూ వచ్చారు. అందుకే ఆమెకు దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అనుష్క మూడు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తు్న్నారు. అమెజాన్‌లో ఓ కాప్ డ్రామా సిరీస్ త్వరలో విడుదల కానుంది. నెట్ ఫ్లిక్స్‌లో రెండు ప్రాజెక్ట్‌లు విడుదల కాబోతున్నాయి. ‘జీరో’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అనుష్క సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకోవడం మంచిది అనుకున్నారు. పెళ్లయ్యాక విరాట్, అనుష్కకు పర్సనల్ స్పేస్ లేకుండా పోయింది. విరాట్ మ్యాచ్‌లతో అనుష్క సినిమాలతో బిజీ అయిపోయారు. అందుకే తన భర్త కోసం దాదాపు ఏడాది పాటు సమయం కేటాయించాలనుకున్నట్లున్నారు. అనుష్క తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31ApbxK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...