‘సాహో’ బాక్సాఫీసు బ్యాంగ్ కొనసాగుతూనే ఉంది. సినిమాపై విమర్శకులు కారాలు మిరియాలు నూరినా.. కొంత మంది ప్రేక్షకులు పెదవి విరిచినా ఆ ప్రభావం కలెక్షన్లపై పడలేదు. సినిమా ఎలా ఉన్న ఫర్వాలేదు తెరపై ప్రభాస్‌ను చూస్తే చాలు అన్నట్టుగా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలిరోజు టాక్ చూసి ఈ రేంజ్ కలెక్షన్లు ఎవ్వరూ ఊహించలేదు. శుక్రవారంతో పోలిస్తే శనివారం కలెక్షన్ కాస్త తగ్గినా.. మళ్లీ ఆదివారం పుంజుకుంది. మూడు రోజుల్లో ‘సాహో’ ప్రపంచ వ్యాప్తంగా రూ.294 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. వాస్తవానికి ‘సాహో’ ప్రభంజనం మొదటిరోజుకే పరిమితం అనుకున్నారు అంతా. కానీ, రెండో రోజు కూడా బాక్సాఫీసుని వసూళ్ల వరదతో ముంచెత్తింది ‘సాహో’. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘సాహో’.. రెండు రోజుల్లో రూ.205 కోట్లు రాబట్టింది. ఇక తొలివారం ముగిసేసరికి మూడు రోజుల్లో రూ.294 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రూ.300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇక, నాలుగో రోజు అంటే సోమవారం వినాయక చవితి సెలవు రోజు కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అంటే, నాలుగు రోజుల్లో ‘సాహో’ రూ.350 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయం. తొలిరోజు సినిమా టాక్ చూసి నిర్మాతలు పెట్టిన బడ్జెట్ తిరిగిరావడం కష్టం అనుకున్నారు. కానీ, ‘సాహో’ ఊపు చూస్తుంటే అసలు ఏమిటి.. లాభాలు కూడా బాగానే వచ్చేలా కనిపిస్తోంది. నైజాంలో మొదటి మూడు రోజుల్లో ‘సాహో’ రూ.20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందని అంటున్నారు. Also Read: నైజాంలో ‘సాహో’ సినిమా రైట్స్‌ను రూ.40 కోట్లకు విక్రమయించినట్టు సమాచారం. అంటే, ప్రస్తుతం మూడు రోజుల్లో 50 శాతం వసూలైంది. ఇక ఫుల్ రన్‌లో ఎంత మొత్తం వసూలు చేస్తుందో చూడాలి. ఏపీ, తెలంగాణలో ‘సాహో’ థియేట్రికల్ రైట్స్‌ను రూ.125 కోట్లకు అమ్మినట్టు టాక్. మరి, ఈ మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ వసూలు చేస్తేనే హిట్ చిత్రంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ‘సాహో’ ఊపు చూస్తుంటే వసూలు చేసేలానే కనిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZDbFMe
v
No comments:
Post a Comment