Monday, 2 September 2019

అనెక్స్‌పెక్టెడ్ కాంబోలో అల్లు అర్జున్ సినిమా!

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరవాత చాలా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన అభిమానులను ఖుషీ చేస్తూ వరసపెట్టి సినిమాలను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల... వైకుంఠపురములో...’ అనే సినిమాలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా తరవాత సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమా చేయాల్సి ఉంది. త్రివిక్రమ్ సినిమా తరవాత బన్నీ.. సుకుమార్‌తో చేస్తారు. Also Read: ఇదిలా ఉంటే, ఈ సినిమాల తరవాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందంటూ ఫిల్మ్ నగర్‌లో ఒక టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఈ కాంబో ఎవ్వరూ ఊహించి ఉండరు. తమిళంలో ‘గజిని’, ‘తుపాకి’, ‘కత్తి’ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీస్తూ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఎ.ఆర్.మురగదాస్ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. కానీ, ఆయనపై మనోళ్లకు కాస్త భయం ఉంది. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన డైరెక్ట్ తెలుగు మూవీస్ ‘స్టాలిన్’, ‘స్పైడర్’ ఎలాంటి ఫలితాలను ఇచ్చాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2017లో మహేష్‌బాబుతో చేసిన ‘స్పైడర్’ డిజాస్టర్‌ కావడంతో మురుగదాస్‌పై తెలుగు ప్రేక్షకులకు నమ్మకం పోయింది. కానీ, ‘స్పైడర్’ తరవాత మురుగదాస్ తమిళంలో విజయ్‌తో ‘సర్కార్’ తెరకెక్కించారు. ఇది పెద్ద హిట్. ఇప్పుడు రజినీకాంత్‌తో ‘దర్బార్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎ.ఆర్.మురుగదాస్ చెప్పిన కథ బన్నీకి బాగా నచ్చిందట. 2021లో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తుంది అని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. అల్లు అర్జున్, మురుగదాస్ కాంబో అనగానే ఆసక్తి పెరిగిపోతోంది. సందేశాత్మక సినిమాలు తీసే మురుగదాస్.. బన్నీతో ఎలాంటి సినిమా ప్లాన్ చేశారో తెలుసుకోవాలనే ఆత్రుత అభిమానుల్లో ఎక్కువవుతోంది. ఈ ఆసక్తి, ఆత్రుత తీరాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2kmyAsp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...