Wednesday, 28 August 2019

Salman Khan సెన్సేషన్ సింగర్ రణు మొండల్‌కు ఇల్లు గిఫ్ట్‌గా ఇచ్చారా!

ఒక్క పాటతో బెగ్గర్ నుంచి సెన్సేషన్ సింగర్‌గా మారిపోయారు పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన అనే యాచకురాలు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆలపించిన ‘ఏక్ ప్యార్ కా నగ్‌మా హే..’ పాటకు ఆమె తన స్వరం వినిపించడంతో సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయిన ఆమెకు బాలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా ఛాన్సిచ్చాడు. రైల్వే స్టేషన్లో సాధారణ యాచకురాలిగా పాట పాడిన ఆమె.. రికార్డింగ్ థియేటర్‌లో హిమేష్ రేష్మియాతో కలిసి గాత్రం కలిపారు. తన సక్సెస్‌లో తొలి అడుగు వేశారు రణు మొండల్. ఈ క్రమంలో ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణు మొండల్ టాలెంట్‌ను గుర్తించి, ఆమె ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న బాలీవుడ్ కండలవీరుడు ఆమెకు దాదాపు రూ.55 లక్షల విలువ చేసే ఇల్లు కొనిచ్చారని ప్రచారం జరుగుతోంది. ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ దబాంగ్-3లోనూ ఆ సింగర్‌కు అవకాశం ఇచ్చారని ఆనోటా ఈనోటా పాకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హీరో సల్మాన్ ఖాన్ సన్నిహితుడొకరు ఎకనామిక్ టైమ్స్‌తో దీనిపై మాట్లాడారు. ‘సెన్సేషన్ సింగర్ రణు మొండల్‌కు సల్మాన్ ఇల్లు కొనిచ్చారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. సల్మాన్ తన నెక్ట్స్ మూవీలో సింగర్‌గా చాన్స్ ఇచ్చారనది నిజం కాదని’ కండలవీరుడి సన్నిహితుడు మీడియాకు వెల్లడించారు. దీంతో రణు మొండల్‌కు సల్మాన్ ఇల్లు కొనిచ్చారని, సినిమాలో ఛాన్స్ ఇచ్చారనే ప్రచారం కేవలం వదంతులు మాత్రమేనని తెలుస్తోంది. Also Read: కాగా, పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా రాణాఘట్ రైల్వే స్టేషన్‌లో రణు మండల్ అనే యాచకురాలు పాడిన పాట వైరల్ కావడంతో ఆమె సెన్సేషన్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కంపోజర్ హిమేష్ రేష్మియా ఆమె టాలెంట్ గుర్తించాడు. ఆయన లేటెస్ట్ ఆల్బమ్‘తేరి మేరీ కహానీ’లో రణు మండల్‌ పాడిన పాట సైతం సోషల్ మీడియాను ఊపేసింది. ఈ క్రమంలోనే సల్మాన్ ఆ సింగర్‌కు సాయం చేశారని పుకార్లు షికార్లు చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30G08Jd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...