Wednesday, 28 August 2019

నాని సినిమా.. వెనకడుగు వేసిన మెగా హీరో

నేచురల్ స్టార్ నాని, మెగా హీరో నటించిన గ్యాంగ్ లీడర్, వాల్మీకి సినిమాలు ఒకే రోజు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవకుండా ఉండేందుకు ‘వాల్మీకి’ దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల హరీశ్ శంకర్ అభిమానులతో ట్విటర్ చాట్ చేశారు. ఆ సమయంలో ఓ అభిమాని హరీశ్‌కు ట్వీట్ చేస్తూ.. ‘గ్యాంగ్ లీడర్, వాల్మీకి ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతున్నాయి. సినిమా వాయిదా వేయచ్చు కదన్నా..’ అని రిక్వెస్ట్ చేశారు. ఇందుకు హరీశ్ స్పందిస్తూ.. ‘అది క్లాష్ కాదు. కలిసి విడుదల అవుతున్నాయి. సినీ అభిమానులకు ఇక పండగే’ అన్నారు. కానీ హరీశ్ మనసు మార్చుకున్నారు. ఒకే రోజు విడుదల చేయడం రిస్క్ అని భావించి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో సెప్టెంబర్ 13న విడుదల కావాల్సిన ‘వాల్మీకి’ చిత్రం 30కి వాయిదా పడింది. తమిళంలో తెరకెక్కిన ‘జిగర్తాండా’ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. తమిళ నటుడు అథర్వ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zq0veT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...