Wednesday, 28 August 2019

షారుక్, ఆలియాపై పాక్ నటి ఆరోపణలు

‘ఇదెక్కడి అన్యాయం. ఓ పక్క మమ్మల్ని నోటికొచ్చినట్లు తిడుతున్నారు. మరోపక్క మా సినిమాలను, మా కంటెంట్‌నే కాపీ కొడుతున్నారు’ అంటూ బాలీవుడ్ నటులు , ఆలియా భట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాకిస్థానీ నటి మెహ్విష్ హయత్. ఆలియా నటించిన తొలి ఆల్బమ్ ‘ప్రాడా’ ఇటీవల విడుదలై మంచి క్రేజ్ దక్కించుకుంది. అయితే ఈ పాటను పాకిస్థానీలో విడుదలైన ‘గోరే రంగ్’ అనే పాట నుంచి కాపీ కొట్టారని హయత్ ఆరోపిస్తున్నారు. ‘మరోసారి భారతీయులు మన కంటెంట్‌ను కాపీ కొట్టారు. ఇప్పటికైనా పాకిస్థానీలు మేల్కొని బాలీవుడ్ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో గమనించండి. షారుక్.. మీకు దేశభక్తి ఉందని ఒప్పుకొంటాను. మిమ్మల్ని ఎవ్వరూ ఆపడం లేదు. కానీ మమ్మల్ని మాత్రం తక్కువ చేయకండి. ఓ పక్క మమ్మల్ని నోటికొచ్చినట్లు తిడుతుంటారు. మరోపక్క మా కంటెంట్‌ను కాపీ కొడుతున్నారు. కాపీరైట్స్ అనేది ఒకటి ఉందన్న విషయం కూడా వారికి తెలీదనుకుంటా’ అంటూ మండిపడ్డారు. షారుక్ ఖాన్‌కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ కూడా విడుదలైంది. ఇది కూడా ఓ పాకిస్థానీ సినిమాను బేస్ చేసుకుని తెరకెక్కించారని హయత్ ఆరోపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Lh7QTF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...