‘సినిమా గురించి మాట్లాడటానికి ఓ తమిళ సినిమా నిర్మాత నన్ను గదిలోకి రమ్మన్నాడు’ అంటూ తనకు ఎదురైన షాకింగ్ సంఘటన గురించి బయటపెట్టారు బాలీవుడ్ నటి, . కెరీర్ తొలినాళ్లలో తనకు సినిమాల్లో అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి తప్పించేసేవారని తెలిపారు. ఓ నిర్మాత సినిమా గురించి మాట్లాడాలని చెప్పి పబ్లిక్ ప్లేసెస్‌కు రమ్మనకుండా ఏకంగా గదిలోకే రమ్మన్నాడని పేర్కొన్నారు. ‘తమిళంలో దాదాపు 14 సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయాను. ఓసారి ఫోన్‌లోనే సినిమాకు ఓకే చేశాను. చిత్రీకరణ నిమిత్తం చెన్నై వెళ్లాను. కొన్ని సన్నివేశాల్లో నటించాను. కానీ నాకు అసౌకర్యంగా అనిపించింది. దాంతో సినిమా నుంచి తప్పుకొన్నాను. దాంతో చిత్రబృ ందం నాకు నోటీసులు పంపించి. మరో సంఘటనలో ఓ దర్శకుడు స్క్రీన్‌లో నన్ను చూసి ‘హీరోయిన్‌కు ఉండాల్సిన అందం లేదు’ అని నా తల్లిదండ్రుల ఎదుటే అవమానించాడు’ ‘దాంతో నేను చాలా నెలల పాటు నన్ను నేను అద్దంలో చూసుకోలేకపోయా. నాపై నాకే అసహ్యం వేసేది. చాలా రోజుల పాటు నాపై కామెంట్స్ చేసిన దర్శకుడిని క్షమించలేకపోయాను. ఓసారి ఎవరో నా గురించి కామెంట్స్ చేస్తూ.. ‘ఇలాంటి దుస్తులేసుకుంటే బయటికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంట్లోనే కూర్చోవచ్చు’ అన్నాడు. ఆ మాటల్ని చాలా నెలల పాటు మర్చిపోలేకపోయాను. నాకు ఆ కామెంట్స్ కలలోకి కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు అసలు వాటి గురించి పట్టించుకోవడమే లేదు’ అని వెల్లడించారు .
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NAQX97
v
No comments:
Post a Comment