పవర్ స్టార్, జనసేన అధినేత బర్త్ సంబరాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 2న కావడంతో సోషల్ మీడియా వేదికగా జనసైనికుల్లోనూ.. మెగా అభిమానుల్లోనూ ఉత్సాహాన్నిచ్చే ఫొటోను షేర్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సెప్టెంబర్ 2న 48వ ఏటలోకి అడుగుపెడుతున్న పవన్‌కు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మెగా ఫ్యాన్స్ కోసం ‘పవన్ కళ్యాణ్ బర్త్ డే కామర్ డీపీ’ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు రామ్ చరణ్. Raed Also: ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ఒక ఫొటోలో నవ్వుతూ మరో ఫొటోలో దీర్ఘ ఆలోచన చేస్తూ రెండు వేరియేషన్స్ ఉన్న ఫొటోతో అలరిస్తున్నారు. ఇక పోస్టర్‌కు ‘జనసేనాని’ అనే టైటిల్‌ని ఇవ్వగా.. సెలైన్ సూదులు ఉన్న పవన్ చేయి ‘మార్పు వచ్చే వరకూ ఎత్తులేస్తా’ అన్నట్టుగా ఉంది. Read Also: సెప్టెంబర్ 2న వినాయక చవితి కూడా కలిసి రావడంతో మెగా ఫ్యాన్స్ పవన్ పుట్టినరోజున నిజమైన పండుగగా భావిస్తున్నారు. రామ్ చరణ్ అలా షేర్ చేశారో లేదో.. ఈ ఫొటో చాలామంది జనసైనికులకు కామన్ డీపీగా మారింది. ప్రస్తుతం #PawanKalyanBirthdayCDP హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PmsDu8
v
No comments:
Post a Comment