Friday, 16 August 2019

Manchu Vishnu: మంచు విష్ణు చెల్లి కాజల్.. ఫొటో వైరల్

అందం, అభినయం అన్నీ ఉన్నా టాలీవుడ్ అందాల చందమామ కాజల్‌కి లక్ కలిసి రావడం లేదు. పవన్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్‌లతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన కెరియర్ డౌన్ అవుతూ వస్తోంది. ఇటీవల తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ చిత్రంతో డిజాస్టర్ అందుకుంది. తాజాగా శర్వానంద్ ‘రణరంగం’ చిత్రంలోనూ నటించింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తుండగా మరో కొత్త సినిమాకి సైన్ చేసింది కాజల్. టాలీవుడ్ టాప్ స్టార్‌లు అందరితోనూ జోడీ కట్టిన కాజల్.. తాజాగా సినిమాలో నటిస్తోంది. అయితే మంచి విష్ణు సినిమాలో కాజల్ అంటే అతనితో జోడీ కడుతుందనే అనుకున్నారంతా.. అయితే ఈ సినిమాలో విష్ణుకి చెల్లెలుగా నటిస్తున్నట్టు సమాచారం. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలు కీలకం కావటంతో విష్ణు, కాజల్‌లు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. తాజాగా రాఖీ సందర్భంగా మంచు విష్ణుకి రాఖీ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ‘హ్యాపీ రాఖీ అర్జున్.. అని షూటింగ్ లొకేషన్ ఫొటోను షేర్ చేయడంతో విష్ణు చెల్లిలిగా కాజల్ అనేది ఖాయమైంది. ఈ చిత్రంలో విష్ణు పాత్ర పేరు అర్జున్. ఇక ఈ అన్నా చెల్లెల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZcJsLK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...