Wednesday, 28 August 2019

చిరు ప్రవర్తన చూసి షాకయ్యా: హృతిక్

టాలీవుడ్ హీరోలకే కాదు పలువురు బాలీవుడ్ కథానాయకులకు కూడా మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానం. చిరు సింప్లిసిటీని చూసి షాకవ్వని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. చిరు గురించి ఏ సెలబ్రిటీ మాట్లాడినా ముందుగా ఆయన సింప్లిసిటీ గురించే చెబుతారు. తాజాగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ చిరు గురించి ఒకానొక సందర్భంలో మాట్లాడారు. ‘నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. తెలుగు హీరోల వర్క్ నాకు చాలా నచ్చుతుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి. చిరు సర్‌ని చాలా సార్లు కలిశాను. ఆయనకంటే నేనే పెద్ద అన్నట్లుగా చాలా సౌమ్యంగా మాట్లాడతారు. ఓసారి ఐఫా అవార్డ్ వేడుకలు జరుగుతుంటే చిరు కూడా వచ్చారు. ఆ వేడుకకు నేనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాను. అక్కడికి వచ్చిన ఇతర సెలబ్రిటీల వద్ద చిరు స్వయంగా వెళ్లి పలకరించడం చూసి షాకయ్యాను. ఆయన ప్రవర్తన టాలీవుడ్ చిత్రపరిశ్రమ కల్చర్ ఎలా ఉంటుందో తెలియజేసింది. చాలా అద్భుతమైన వ్యక్తి’ అని వెల్లడించారు. హృతిక్ నటించిన వార్ సినిమా తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో టైగర్ ష్రాఫ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. అక్టోబర్ 2న వార్ ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NwJloe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...