Wednesday, 28 August 2019

ప్రభాస్ అభిమానులకు బంపర్ ఆఫర్

‘డార్లింగ్’ ప్రభాస్‌ను ఎప్పుడూ వెండితెరపైనే చూడాలా? ఓసారి కలిస్తే పోలా.. అదెలాగంటారా.. ప్రభాస్ అభిమానుల కోసం ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. ఆయన్ని కలవాలనుకుంటే ఈ సింపుల్ పని చేస్తే చాలు. అదేంటంటే.. మీకెక్కడైనా ‘సాహో’ పోస్టర్ కనిపిస్తే.. దానితో సెల్ఫీ దిగి ప్రభాస్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేయండి. ప్రభాసే స్వయంగా పలువురు విన్నర్స్‌ను ఎంపిక చేసి వారిని కలుస్తారు. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ అభిమానులకు ఈ బంపర్ ఆఫర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. Read Also: ఆ అదృష్టవంతులెవరో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో సాహో క్రేజ్ పీక్స్‌లో ఉంది. ప్రచార కార్యక్రమాల కోసం చిత్రబృ ందం ఏ అవకాశాన్ని వదిలిపెట్టడంలేదు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సాహో విడుదల కాబోతోంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలిరోజే అన్ని భాషలతో కలిపి దాదాపు రూ.60 కోట్లు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనాల వేస్తున్నారు. Read More: అయితే సాహో సినిమా బాహుబలి: ది కన్‌క్లూజన్ సినిమా వసూళ్లను మాత్రం బీట్ చేయలేదని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అడ్వాన్స్‌డ్ బుకింగ్స్‌కు కూడా విపరీతమైన క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PiSaEv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...