స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. పేరుకు తగ్గట్టుగానే రియల్ లైఫ్‌లోనూ చాలా స్టైలిష్ అండ్ ఫుల్ లగ్జరీ. తండ్రి బడా నిర్మాత కావడంతో పాటు.. స్టార్ హీరోగా కోట్లు సంపాదిస్తున్న అల్లు అర్జున్‌కి వివిధ రకాల బ్రాండ్‌లకు సంబంధించిన వాచ్‌లు, డ్రెస్‌లతో పాటు మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన కార్లు అన్నా మహా మోజు. అందుకే ఇటీవల స్టైలిష్ తన కోసం ప్రత్యేకంగా ఒక కారవాన్ తయారుచేయించుకున్నాడు. సుమారు రూ. 7 కోట్లతో ఫాల్కన్ కారవాన్ చేయించుకుని మనోడు మహా కాస్ట్లీ గురూ అని సోషల్ మీడియాలో సందడి చేశాడు. Read Also: కారవాన్ తరువాత.. మరో లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. కొత్త రేంజ్ రోవర్ కారు కొన్న బన్నీ 'మా ఇంట్లోకి కొత్త కారు వచ్చింది. దానికి నేను 'బీస్ట్' అని పేరు పెట్టా. నేను ఏ వస్తువు కొన్నా దానిలో చూసేది కృతజ్ఞతనే' అని బన్నీ ట్విట్టర్‌లతో తన కొత్త కారుని షేర్ చేశారు. Read Also: ఇదిలా ఉంటే వరుసగా రెండు ఖరీదైనా కార్లు కొన్న బన్నీని చూసి కుళ్లో ఏంటో తెలియదు కాని.. వివాదాస్పద నటి బన్నీ కార్లపై కామెంట్ చేసింది. అతనికి కంగ్రాట్స్ చెప్తూనే.. ‘కోట్లు విలువచేసే కారవాన్, రేంజ్ రోవర్ కార్లను కొన్నావు కాని.. కేరళ వరద బాధితులకు ఎంత సాయం చేశావ్.. అక్కడ నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా.. నువ్ వాళ్లకు హెల్ప్ చేస్తావని భావిస్తున్నా’ అంటూ పోస్ట్ వదిలింది శ్రీరెడ్డి. అయితే 2018 ఆగస్టులో కేరళ రాష్ట్రం భారీ వరదల కారణంగా అతలాకుతలమైన వేళ అల్లు అర్జున్ స్పందించి తన పెద్ద మనసు చాటుకున్న విషయాన్ని మరిచింది శ్రీరెడ్డి. అప్పట్లో కేరళ ప్రజలకు తనవంతు సాయంగా రూ.25 లక్షలు సాయం చేశారు అల్లు అర్జున్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L28tl2
v
No comments:
Post a Comment