బో , షాహిద్ కపూర్ ఒకప్పుడు ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. కానీ షాహిద్ కంటే ముందు కరీనాకు ఓ హీరోపై క్రష్ ఉండేదట. అతనెవరో కాదు 1990ల నాటి నటుడు రాహుల్ రాయ్. ‘ఆషికి’ సినిమాలో కరణ్ కథానాయకుడిగా నటించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పుడే కరణ్‌పై మనసు పారేసుకున్నానని కరీనా అంటున్నారు. ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ అనే రియాల్టీ షోకు కరీనా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బెబో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘నాకు రాహుల్ రాయ్‌పై క్రష్ ఉండేది. అతన్ని చాలా ఇష్టపడేదాన్ని. అతని కోసమే ‘ఆషికి’ సినిమాను ఎనిమిది సార్లు చూశాను’ అని తెలిపారు. రాహుల్ రాయ్, అను అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాను మహేశ్ భట్ తెరకెక్కించారు. ఇటీవల కరీనా తన భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారుడు తైమూర్‌తో కలిసి లండన్ వెళ్లి వచ్చారు. దాదాపు రెండు నెలల తర్వాత ముంబయి చేరుకున్నారు. ప్రస్తుతం కరీనా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ‘అంగ్రేజీ మీడియం’, ‘గుడ్ న్యూస్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30J8tfm
v
No comments:
Post a Comment