Tuesday, 27 August 2019

అతను నా బిడ్డకు తండ్రి.. ఎలా తప్పించుకుంటాను?

మలైకా, అర్బాజ్‌కు 16 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతని పేరు అర్హాన్. కుమారుడి కోసం ఏళ్ల క్రితం విడిపోయినప్పటికీ కుమారుడి కోసం అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉంటారు. అయితే మలైకా తన సోదరి అతతో కలిసి ఓ షోలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విలేకరి అర్భాజ్ గురించి ప్రశ్నించారు. ఇందుకు మలైకా స్పందిస్తూ.. ‘మేం విడిపోవాలనుకున్నప్పుడు అర్బాజ్ నాకు ఒక మాట చెప్పాడు. విడాకులకు సంబంధించి తానే ఎక్కువగా స్పందించాలనుకుంటున్నట్లు తెలిపారు. అన్నట్లుగానే ఆయనే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పటికే ప్రజలకు మాపై ఉన్న సందేహాలన్నింటికీ అర్బాజ్ సమాధానాలు ఇచ్చేసి ఉంటారని అనుకుంటున్నాను. మేం విడిపోయినప్పటికీ అర్బాజ్ మా కుటుంబీకులతో మాట్లాడుతుంటారు. మా ఇంట్లో వారు ఆయన్ను కన్న బిడ్డగా చూసుకుంటారు. మాకు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. నా కుమారుడికి అర్బాజ్ తండ్రి. అలాంటప్పుడు నేను అర్బాజ్ గురించి మాట్లాడకుండా ఎలా తప్పించుకుంటాను? ’ అని తెలిపారు. అనంతరం అర్జున్ కపూర్‌తో రిలేషన్ గురించి మాట్లాడుతూ.. ‘అర్జున్ నేను ఇంకా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నాం. అయినా మా పెళ్లి గురించి ఇతరులు ఎందుకు అంత తొందరపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అది జరగాల్సి వచ్చినప్పుడు జరుగుతుంది’ అని చెప్పుకొచ్చారు మలైకా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/342dmSF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...