Thursday, 11 July 2019

iSmart Shankar: ‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ రివ్యూ: దీనమ్మ కిక్కూ అని ఎత్తేశాడు

‘నా దిమాక్‌ ఏందిరా డబుల్‌ సిమ్‌ కార్డు లెక్కుందీ’.. అంటూ బుర్రలో చిప్ పెట్టుకుని సంగం పిచ్చోడి మాదిరిగా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఈనెల 18 థియేటర్స్‌కి వస్తున్నాడు ఎనర్జిక్ స్టార్ రామ్. వరుస పరాజయాలతో ఢీలా పడ్డ ఈ ఎనర్జిటిక్ స్టార్.. ‘టెంపర్’ చిత్రం తరువాత హిట్ ముఖమే చూడని డేరిండ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌ పూరీని నమ్ముకున్నారు. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కిన ‘ఇస్మార్ శంకర్’‌పై భారీ అంచనాలే ఉన్నాయి. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని టూరింగ్‌ టాకీస్‌, పూరి కనక్ట్‌ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ వీడియోలు పూరీ మార్క్ కనిపిస్తుండగా.. రామ్ ఎనర్జీ బాగా ఎక్కువైందనే విమర్శల్ని పక్కన పెట్టేసి విరివిగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే .. నిధి అగర్వాల్, నభా నటేష్, చార్మీలను వెంటేసుకుని కాలేజ్ కాంపస్‌లు తిరుగుతూ ప్రమోషన్స్‌తో హోరెత్తిస్తున్నారు. దర్శకుడిగా పూరీకి.. హీరోగా రామ్‌కి.. నిర్మాతగా చార్మీకి.. హీరోయిన్‌గా నిధిగా హిట్ మస్ట్ అయిన పరిస్థితుల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు హీరో రామ్. ‘ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూశా.. దీనమ్మా కిక్కూ!! ఈ పాత్రను పోషిస్తున్నప్పుడు.. స్క్రీన్‌పై చూసుకున్నప్పడు వచ్చిన కిక్కే వేరప్పా.. ఇలాంటి కిక్ ఇచ్చిన సినిమా చేసి చాలా రోజులైంది. థాంక్స్ పూరీ జగన్నాథ్ గారూ.. మీరు డ్రగ్ అని చాలా మంది గ్రహించరు’.. అంటూ తన సినిమాకి హైవోల్టేజ్ రివ్యూ ఇచ్చారు ఇస్మార్ట్ శంకర్. అయితే రామ్ చెప్పినట్టుగానే సినిమా ప్రేక్షకులకు బీభత్సమైన కిక్ ఇచ్చిందో లేదో ఈనెల 18న తేలిపోనుంది. అంతవరకూ రామ్ చెప్పిన మాటల్ని నమ్మక తప్పదు మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XGAZAI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...