Thursday, 11 July 2019

Amit Purohit: ‘సమ్మోహనం’ నటుడు ఆకస్మిక మృతి.. షాక్‌లో చిత్ర యూనిట్

‘సమ్మోహనం’ చిత్రంతో పేరు తెచ్చుకున్న యువ నటుడు అకాల మరణ వార్త ఇండస్ట్రీ వర్గాలను షాక్ గురిచేసింది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం చిత్రంలో అమిత్ పురోహిత్ అదితి రావ్ హైదరీకి బాయ్ ఫ్రెండ్‌గా నటించారు. బాలీవుడ్‌లో పంక్, ఆలాప్ సినిమాల్లో నటించిన అమిత్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా.. ‘సమ్మోహనం’ చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. హీరో సుధీర్ బాబు తన కో స్టార్ మరణ వార్తను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. విచారం వ్యక్తం చేశారు. మరో యంగ్ టాలెంట్ నటుడ్ని ఇండస్ట్రీ కోల్పోయిందని.. సెట్‌లో అందరితో చాలా ఫ్రెండ్లీగా అమిత్ పురోహిత్ ఉండేవారని.. అతని ఆత్మకి శాంతి చేకూరాలన్నారు సుధీర్ బాబు. ‘సమ్మోహనం’ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ ట్వీట్ చేస్తూ.. అమిత్ పురోహిత్ మరణ వార్తను నమ్మలేకపోతున్నానని.. మంచి ప్రవర్తనతో టాలెంటెడ్ నటుడిగా పేరుతెచ్చున్న అమిత్‌ని ఇంత త్వరగా మిస్ అవుతామని అనుకోలేదన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలన్నారు ఇంద్రగంటి. హీరోయిన్ అతిథి రావ్ హైదరీ స్పందిస్తూ.. హార్డ్ వర్కింగ్ పర్సన్‌ని ఇంత త్వరగా కోల్పోతాం అనుకోలేదు. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YLQCmZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...